Karva Chauth: భర్త దీర్ఘాయుష్షు కోసం రోజంతా ఉపవాసం.. అదే రోజు విషం పెట్టి భర్తను చంపిన భార్య

|

Oct 21, 2024 | 7:49 PM

భక్తి శ్రద్ధలతో భర్త క్షేమం కోసం ఓ మహిళ రోజంతా ఉపవాసం ఉంది. అదే రోజు సాయంత్రం ఉపవాసం విరమించిన భార్య.. భర్తతో కలిసి భోజనం చేసింది. అయితే కాసేపటికే భర్త మరణించాడు.. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బట్టబయలు..

Karva Chauth: భర్త దీర్ఘాయుష్షు కోసం రోజంతా ఉపవాసం.. అదే రోజు విషం పెట్టి భర్తను చంపిన భార్య
Karva Chauth
Follow us on

లక్నో, అక్టోబర్ 21: ఉత్తరాది పండగల్లో కర్వాచౌత్‌ పండగ చాలా ప్రత్యేకం. భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ ఎంతో నిష్టతో చేస్తుంటారు. అయితేఈ పండగ రోజున ఓ మహిళ భర్త క్షేమం కోసంరోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. ఆ తర్వాత అదే రోజు భర్తకు విషమిచ్చి చంపింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కౌశాంబి జిల్లాలోని కడ ధామ్ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన శైలేష్ కుమార్ (32), అతడి భార్య సవిత ఆదివారం కర్వా చౌత్ ఆచరించారు. ఈ సందర్భంగా భర్త దీర్ఘాయుష్షు కోసం సవిత రోజంతా ఉపవాసం ఉండి, పూజలు చేయసింది. శైలేష్ కూడా భార్య పూజల కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆదివారం సాయంత్రం సవిత ఉపవాసాన్ని విరమించిన కాసేపటికే భర్త శైలేష్‌తో వాగ్వాదానికి దిగింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేశారు. అయితే భోజనం చేసిన కొద్ది సేపటికే సవిత భర్త శైలేష్ మృతి చెందాడు. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని భావించిన సవిత.. విషం కలిపిన ఆహారాన్ని భర్తకు పెట్టింది. భోజనం తర్వాత పొరుగింటికి వెళ్లి ఏదో తీసుకురమ్మని భర్తను పంపించి, ఆమె ఆ ఇంటి నుంచి పరారైంది. ఇక షాహారం తిన్న శైలేష్‌ కొంత సేపటికి తీవ్ర అవస్వస్థతకు గురవడంతో.. ఆతడి సోదరుడు సమీపంలోని ఓహాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

విషం కలిపిన ఆహారాన్ని తనకు భార్య పెట్టిందని శైలేష్‌ చెప్పగా.. వెంటనే సోదరుడు బాధితుడి మాటలను ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ శైలేష్‌ మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని, శైలేష్‌ భార్య సవితను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శైలేశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.