House Demolish: నా ఇల్లు అక్రమంగా కట్టిందే.. కూల్చేయండి ప్రభుత్వానికి పౌరుడు వినతి ఎక్కడో తెలుసా..

House Demolish: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.  మొన్నటికి మొన్న మేము రౌడీలం మమల్ని అరెస్ట్ చేయండి అంటూ పోలీస్ స్టేషన్(Police Station) కు కొంతమంది క్యూ లు కడితే..

House Demolish: నా ఇల్లు అక్రమంగా కట్టిందే.. కూల్చేయండి ప్రభుత్వానికి పౌరుడు వినతి ఎక్కడో తెలుసా..
Up Man
Follow us
Surya Kala

|

Updated on: Apr 03, 2022 | 2:01 PM

House Demolish: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.  మొన్నటికి మొన్న మేము రౌడీలం మమల్ని అరెస్ట్ చేయండి అంటూ పోలీస్ స్టేషన్(Police Station) కు కొంతమంది క్యూ లు కడితే.. ఇప్పుడు ఓ వ్యక్తి.. నా ఇల్లు అక్రమంగా కట్టిందే.. కూల్చేయండి  అంటూ ప్రభుత్వాన్ని కోరాడు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేసే ప్రత్యేక విధానాన్ని యూపీ సర్కారు కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా.. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను కబ్జా చేసిన వాటిపై ఉక్కుపాదం మోపుతోంది. రౌడీ షీటర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో అక్రమంగా కట్టిన తన ఇంటిని బుల్డోజర్ తో కూల్చేయాలంటూ ఓ పౌరుడు ప్రభుత్వాన్ని కోరడం అక్కడి పరిస్థితులను కళ్లకు కడుతోంది.

రాంపూర్ జిల్లా మిత్రాపూర్ ఎహ్రోలా గ్రామంలో ప్రభుత్వానికి చెందిన ఎండిపోయిన చెరువు, సమాధుల భూములను ఆక్రమించి కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అందులో ఎహ్సాన్ మియాన్ అనే వ్యక్తి ఇల్లు కూడా ఉంది. అది గమనించిన మియాన్ .. ప్రభుత్వం ఎలానూ తన ఇల్లు కూల్చేస్తుందన్న భయంతో అతడే స్వయంగా జిల్లా కలెక్టర్ అకోశ్ చౌదరి వద్దకు వెళ్లి తన అక్రమ ఇంటి నిర్మాణాన్ని కూల్చేయాలని దరఖాస్తు ఇచ్చాడు. ‘‘ఆ ఇంటిలో రెండు తరాలుగా మా కుటుంబం నివసిస్తోంది. వక్ఫ్, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినట్టు ఇటీవలే నా ప్లాట్ మ్యాప్ చూసి గుర్తించాను. దాంతో కూల్చేందుకు దరఖాస్తు పెట్టుకుంటున్నాను’’అని మియాన్ తెలిపాడు. తమ దర్యాప్తులో మియాన్ వాదన నిజమేనని తేలినట్టు అక్కడి జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు.

Jayaprada: వెండితెరపై వెన్నెల సంతకం..భారతీయ స్త్రీ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం..అచ్చ తెలుగమ్మాయి జయప్రద పుట్టిన రోజు నేడు..