తృణమూల్‌ ఎంపీలపై యూపీ పోలీసుల దౌర్జన్యం

|

Oct 02, 2020 | 5:05 PM

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. నిన్నటికి నిన్న రాహుల్‌గాంధీతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు ఇవాళ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలపై దౌర్జన్యానికి దిగారు..

తృణమూల్‌ ఎంపీలపై యూపీ పోలీసుల దౌర్జన్యం
Follow us on

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. నిన్నటికి నిన్న రాహుల్‌గాంధీతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు ఇవాళ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలపై దౌర్జన్యానికి దిగారు.. హథ్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనపై విపక్షాలు శుక్రవారం కూడా నిరసనకు దిగాయి.. ఆందోళనలు చేస్తున్నాయి.. ఈ నేపథక్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బాధిత యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు వెళ్లారు.. అయితే వారిని సరిహద్దుల్లోనే అపేసి హద్దు మీరారు పోలీసులు.. లోపలికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు ఖాకీలు. డెరెక్‌ ఓ బ్రియన్‌, కాకోలి ఘోష్‌ దస్తిదార్‌, ప్రతిమా మొండల్‌హావ్‌తో పాటు తృణమూల్‌ ఎంపీలను హథ్రాస్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తృణమూల్ నేతలకు, పోలీసులకు మధ్య అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. .ఈ తోపులాటలో ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌ కింద పడిపోయారు.. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.. పోలీసుల దౌర్జన్యంపై ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఇలాగే అడ్డుకున్నారు. పోలీసుల దౌర్జన్యం పట్ల కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం ఢిల్లీ నగంలో 144 సెక్షన్ విధించింది.