అడ్డెడ్డే.. ఎంత చిక్కొచ్చి పడింది.. పెళ్లికాని ప్రసాదుల పాదయాత్ర.. ఎందుకో తెలుసా..?

|

Feb 11, 2023 | 6:39 PM

మూడు రోజుల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరి 25న ఎంఎం హిల్స్‌కు చేరుకుంటుంది. ఒంటరిగా ఉన్నవారికి సహాయం చేయడమే ఈ యాత్ర లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

అడ్డెడ్డే.. ఎంత చిక్కొచ్చి పడింది.. పెళ్లికాని ప్రసాదుల పాదయాత్ర.. ఎందుకో తెలుసా..?
Wedding
Follow us on

గత కొంతకాలంగా పెళ్లికాని ప్రసాదుల సంఖ్యపెరిగిపోతోంది. గతంలో కొందరు పెళ్లి కావటం లేదనే బాధతో కొందరు యువకులు స్థానిక మండలాధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనే గుర్తుండి ఉంటుంది. అయితే, ఇప్పుడు తాజాగా కొందరు పెళ్లికాని ప్రసాదులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పెళ్లి ఆలస్యమవుతుందని ఆందోళనకు గురవుతున్న యువకులంతా కలిసి పాదయాత్ర చేయాలని యోచిస్తున్నారు. కర్ణాటకలోని మాండ్యలో యువకులు బ్యాచిలర్స్ పాదయాత్ర చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి చేసుకునేందుకు వధువు దొరక్క భగవంతుడి ఆశీర్వాదం కోసం ఈ ప్రయాణం సాగిస్తున్నట్టుగా వారు వెల్లడించారు.

కర్ణాటకలోని మాండ్యలో అబ్బాయిలు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారంతా తమకు మంచి అమ్మాయి దొరకాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం సుమారు 200 మంది బ్రహ్మచారులు మాండ్య నుంచి చామరాజనగర్‌ జిల్లాలోని ఎంఎంహిల్స్‌ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టానున్నారు. తమకు పెళ్లి చేసుకునేందుకు మంచి అమ్మాయి దొరికేలా ఆ దేవతా ఆశీర్వదం పొందడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని చెబుతున్నారు. అయితే, కర్నాటకలో ఆడ, మగ నిష్పత్తిలో వ్యత్యాసం ఉండటంతో పెళ్లికి అమ్మాయిలు దొరకటం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 23 నుంచి బ్యాచిలర్స్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. పొరుగున ఉన్న జిల్లా చామరాజనగర్‌లోని ప్రసిద్ధ ఎంఎం హిల్స్ దేవాలయానికి యాత్ర నిర్వహించనున్నారు. 30 ఏళ్లు పైబడిన 200 మంది పెళ్లికాని యువకులు ఈ పాద యాత్రలో పాల్గొంటారు. 10 రోజుల్లోనే దాదాపు 100 మంది సింగిల్స్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బెంగళూరు, మైసూరు, మాండ్య, శివమొగ్గ జిల్లాలకు చెందిన బ్యాచిలర్స్‌ కూడా ఎక్కువ నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 23న మద్దూర్ తాలూకాలోని KM దొడ్డి గ్రామం నుండి యాత్ర ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరి 25న ఎంఎం హిల్స్‌కు చేరుకుంటుంది. ఒంటరిగా ఉన్నవారికి సహాయం చేయడమే ఈ యాత్ర లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఐతే గతంలో ఈ జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని, దీనికి ఇప్పుడూ ఆ యువకులంతా తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని అక్కడి కొందరు స్థానికులు చెబుతున్నారు. పైగా మాండ్యా జిల్లాలో ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..