Krishna Godavari Board: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులు ఖరారు.. రేపు వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న కేంద్రం

|

Jul 15, 2021 | 9:37 PM

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను కేంద్రం ఖరారు చేసింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ శుక్రవారం గెజిట్లు విడుదల చేయనుంది.

Krishna Godavari Board: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులు ఖరారు.. రేపు వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న కేంద్రం
Follow us on

Krishna Godavari Board gazette notification: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను కేంద్రం ఖరారు చేసింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ శుక్రవారం గెజిట్లు విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్లను కేంద్రం విడుదల చేయనుంది. రెండు బోర్డులకు వేర్వేరుగా కేంద్రం గెజిట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల జల వివాదం నేపథ్యంలో గెజిట్లకు ప్రాధాన్యమేర్పడింది.

ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 ప్రకారం బోర్డుల పరిధి నిర్ధేశించే అధికారం కేంద్రానిదే. దీనిలో భాగంగానే వాటి పరిధిపై కేంద్రం వేర్వేరుగా గెజిట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రాజెక్టుల నిర్వహణ, క్రమబద్ధీకరణ, సంరక్షణలపై ఇరు రాష్ట్రాల పరిధులను కేంద్రం స్పష్టం చేయనుంది. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నా అసాధారణంగా ఏడేళ్లపాటు ఆలస్యమైంది.

కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి నిర్దేశించేందుకు 2020 అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల్‌శక్తి మంత్రితో కూడిన అపెక్స్‌ కమిటీ సమావేశమైనప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధి నిర్దేశించే అధికారం కేంద్రానికి ఉంటుందని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా, గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను కేంద్రం ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Read Also…  

KRMB Letter: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలి.. తెలంగాణ జెన్కోకు కేఅర్ఎంబీ లేఖ

AP-TS Water Disputes: ఆంధ్రా-తెలంగాణ జలవివాదం.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి..