TV9 WITT: మహిళలు మతం, వయస్సు ఆధారంగా అణచివేతకు గురవుతున్నారుః స్మృతి ఇరానీ

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్న వేళ కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. టీవీ9 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్ 2024 వేదికపై సందేశ్‌ఖలీ సంఘటన ప్రస్తావించారు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.

TV9 WITT: మహిళలు మతం, వయస్సు ఆధారంగా అణచివేతకు గురవుతున్నారుః స్మృతి ఇరానీ
Smriti Irani

Updated on: Feb 26, 2024 | 1:43 PM

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్న వేళ కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ 2024 వేదికపై సందేశ్‌ఖలీ సంఘటన ప్రస్తావించారు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ. అంతర్జాతీయ అతిథుల ముందు దేశ అంతర్గత విషయాలపై ప్రకటనలు చేయడం సంచలనంగా మారింది.

భారతదేశ అభివృద్ధిలో మహిళా శక్తి పాత్ర ఏమిటి, మహిళల గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశంపై జరిగిన చర్చలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ‘అక్కడ ఏం జరిగింది అనేది ఏ మనిషి ఊహకు అందనిది. పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగినప్పుడల్లా, బీజేపీ వ్యక్తి అయితే, అతన్ని సులభంగా చంపడం, బీజేపీకి చెందిన మహిళా కార్యకర్త ఉంటే ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి సామూహికంగా అఘాయిత్యానికి పాల్పడటం, బీజేపీ యువమోర్చా కార్యకర్త ఎవరైనా ఉంటే చెట్టుకు ఉరివేసి చంపడం అక్కడ సర్వసాధారణంగా మారిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ‘బీజేపీ సీనియర్‌ కార్యకర్త ఉంటే అతని ఇంటికి నిప్పు పెట్టొస్తారు. మేం బీజేపీ కార్యకర్తలం కాబట్టి.. మమ్మల్ని ఎవరైనా చంపినా పర్వాలేదు.. ఇదే మా రాజకీయం. పోరాటానికి మనం చెల్లించే మూల్యం అది. సందేశ్‌ఖాలీలో జరుగుతున్న దారుణాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ‘వయస్సు, మతం ఆధారంగా మహిళలను వేరు చేస్తున్నారనే విషయం సీఎం మమతా బెనర్జీకి తెలియదా అని ప్రశ్నించారు. రాజకీయం తనదే.. మరో వైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి మాట్లాడాలనుకుంటారు… కానీ రాజకీయాల చిట్టడవిలో షాజాదే కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా బయటకు రావడంలేదని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు స్మృతి ఇరానీ.

అంతకుముందు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘మహిళా శక్తి’ని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించారు. ప్రధాని మోదీ మహిళల సామర్థ్యాన్ని గుర్తించారని, వారికి ప్రత్యేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని స్మృతి ఇరానీ అన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆస్పత్రిలో మహిళలకు ప్రసవాలు జరిగేలా చూశారన్నారు.

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన గురించి స్మృతి ఇరానీ ప్రస్తావిస్తూ, ఈ పథకం మహిళలకు కొత్త శక్తిని ఇచ్చిందని, సుమారు మూడున్నర లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని అన్నారు. మహిళలు ప్రతి రంగంలో పురుషులతో భుజం భుజం కలిపి నడుస్తున్నారని, దేశ రక్షణలో మహిళలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు. భారతదేశ మహిళా శక్తి వైభవాన్ని ప్రపంచం చూసింది. నేడు భారతదేశంలోని మహిళలు ప్రపంచంలో తమ జెండాను రెపరెపలాడిస్తున్నారని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…