Kishan Reddy: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

|

Apr 16, 2023 | 2:10 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం విమాన ప్రయాణాన్ని ప్రజాస్వామ్యీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.. తద్వారా మధ్యతరగతి, తక్కువ ప్రాధాన్యత కలిగిన వారు తక్కువ ఖర్చుతో కూడిన విమాన ప్రయాణాన్ని పొందగలరంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

Kishan Reddy: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Pm Modi Kishan Reddy
Follow us on

శబరిమల అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. శబరిమల సమీపం లోని కొట్టాయం దగ్గర గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం విమాన ప్రయాణాన్ని ప్రజాస్వామ్యీకరించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తద్వారా మధ్యతరగతి, తక్కువ ప్రాధాన్యత కలిగిన వారు తక్కువ ఖర్చుతో కూడిన విమాన ప్రయాణాన్ని పొందగలరంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. 2014 నుంచి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఈ లక్ష్యం కోసం అహర్నిషలు పని చేస్తోందన్నారు. దీంతో విమాన రంగంలో పెను మార్పులు వచ్చాయని తెలిపారు. నేడు దాదాపు 150 ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయని.. వాటిలో సగం (74) 2014 తర్వాత ప్రారంభించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

భక్తులకు, సామాన్య ప్రజలకు ఆధ్యాత్మిక యాత్రలను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ దిశలో కొట్టాయం సమీపంలోని శబరిమల వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్రం సైట్ క్లియరెన్స్ ఆమోదం తెలిపిందని వివరించారు.

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ విధానం ప్రకారం.. రెండు దశల ప్రక్రియ ద్వారా అనుమతులు ఇస్తారు. సైట్ క్లియరెన్స్ ద్వారా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తదుపరి దశకు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి సూత్రప్రాయ ఆమోదం అవసరం.

ప్రతి సంవత్సరం దాదాపు 1 కోటి మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు. వారిలో ఎక్కువ మంది నవంబర్-జనవరి మధ్య జరిగే మండల పూజకు హాజరై స్వామి వారిని దర్శించుకుంటారు.

ఏటా దాదాపు 1 కోటి మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు. వీరిలో తెలుగు రాష్ట్రాలు సుమారు 15 లక్షల మంది ఉంటారు. ఈ క్రమంలో తన అభ్యర్థనపై చర్య తీసుకున్నందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సైతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సైట్ క్లియరెన్స్ కోసం దరఖాస్తులో అందించిన సమాచారం ప్రకారం.. 2263.18 ఎకరాల ప్రభుత్వ భూమి విమానాశ్రయ అభివృద్ధికి గుర్తించారు. ఇంకా, ప్రాజెక్ట్ టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS) నివేదిక ప్రకారం.. విమానాశ్రయం PPP మోడల్‌లో రూ. 3973 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..