
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో విద్యా రంగంలో అనేక కొత్త ప్రయోగాలు జరిగాయి. పాఠశాల విద్య బలోపేతం చేయడానికి సమగ్ర శిక్ష విధానానికి కేంద్ర శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తీసుకు వస్తున్న ఈ మార్పుల మధ్య, 2026 సంవత్సరం జాతీయ విద్యా రంగానికి కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ‘రీఇమేజినింగ్ సమగ్ర శిక్ష’ పేరుతో సమగ్ర శిక్ష 3.0పై సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్య కోసం కేంద్ర నిధులతో కూడిన కార్యక్రమం. ప్రీ-ప్రైమరీ నుండి సీనియర్ సెకండరీ స్థాయిల వరకు అన్ని దశలను ప్రత్యేక భాగాలుగా విభజించి విద్య వ్యవస్థలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విద్యా రంగాల నిపుణులతో చర్చల ద్వారా సమగ్ర శిక్ష 3.0 అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందు కోసం వ్యూహాత్మక, సంప్రదింపులు, కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడం ఈ సమావేశం లక్ష్యం. ఈ పథకం తదుపరి దశలో పాఠశాల విద్యలో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల హక్కులను మెరుగుపరచడానికి ఉద్భవిస్తున్న సవాళ్లను పరిష్కరించడం. ఇందు కోసం ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, కీలకమైన జోక్యాలను గుర్తించడంపై కేంద్రం దృష్టి సారించింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 నాటికి విక్షిత్ భారత్‌ను నిర్మించాలని తలపెట్టారని, దేశంలోని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దేశం 12వ తరగతి వరకు 100 శాతం నమోదు సాధించినట్లయితేనే, దీనిని సాధించవచ్చని పేర్కొన్నారు. అభ్యాస అంతరాలను తగ్గించడం, డ్రాపౌట్‌లను తగ్గించడం, అభ్యాసం, పోషకాహార ఫలితాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయ సామర్థ్యాన్ని పెంచడం, క్లిష్టమైన నైపుణ్యాలను పెంపొందించడం, బలమైన మానవ మూలధనాన్ని నిర్మించడానికి సమిష్టి బాధ్యతలుగా ‘అమృత్ పీఠి’ని మెకాలే మనస్తత్వానికి మించి తరలించడానకి ప్రాముఖ్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి సూచించారు.
2026-2027 విద్యా సంవత్సరానికి సమగ్ర వార్షిక ప్రణాళికను రూపొందించాలని, విద్యా నిపుణులకు, మంత్రిత్వ శాఖలకు, భారత విద్యా మంత్రిత్వ శాఖకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులకు మంత్రి ప్రధాన్ విజ్ఞప్తి చేశారు.. ఇది ఒక జాతీయ ఉద్యమంగా మారాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సహకార చర్చలు, వినూత్న ఆలోచనలు పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి స్పష్టమైన ప్రణాళికను రూపొందించడానికి దోహదపడతాయని విద్యా మంత్రి అన్నారు. సమగ్ర శిక్షను ఫలితాలపై దృష్టి సారించి, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో, భారతీయ విలువలతో పాతుకుపోయి, విద్యార్థుల విభిన్న అవసరాలకు అనుగుణంగా మార్చడం ఈ ప్రణాళిక లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా నిపుణులు, వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు.
Together with Shri @jayantrld ji co-chaired the Consultation Meeting for re-imagining Samagra Shiksha.
Appreciate the enthusiastic participation and valuable suggestions of academic experts, senior officials of sectoral Ministries, @EduMinOfIndia and from the 11 participating… pic.twitter.com/E0CMSE3ijK
— Dharmendra Pradhan (@dpradhanbjp) January 9, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..