Dharmendra Pradhan: ‘విద్యారంగం బలోపేతం, నైపుణ్యాభివృద్ధే లక్ష్యం’.. UAE పర్యటనలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

|

Nov 01, 2023 | 4:08 PM

Dharmendra Pradhan UAE Visit: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవ్వాల్టి నుంచి మూడు రోజుల పాటు (నవంబర్ 1 నుండి 3 వరకు) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం అబుదాబి చేరుకున్న ప్రధాన్.. అక్కడి మంత్రులతో భేటీ అవుతున్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా..

Dharmendra Pradhan: ‘విద్యారంగం బలోపేతం, నైపుణ్యాభివృద్ధే లక్ష్యం’.. UAE పర్యటనలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan
Follow us on

Dharmendra Pradhan UAE Visit: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవ్వాల్టి నుంచి మూడు రోజుల పాటు (నవంబర్ 1 నుండి 3 వరకు) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం అబుదాబి చేరుకున్న ప్రధాన్.. అక్కడి మంత్రులతో భేటీ అవుతున్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. భారతదేశం – UAE మధ్య విద్యారంగం, నైపుణ్య భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ధర్మేంద్ర ప్రధాన్ మూడు రోజులపాటు యూఏఈలో పర్యటిస్తున్నారు. “విద్య & నైపుణ్యాభివృద్ధి రంగాలలో పరస్పర సహకారం, భాగస్వామ్యాన్ని పెంపొందించడం.” ఈ కీలక రంగాలలో పరస్పర ప్రయోజనకరమైన అవకాశాల కోసం ఒక వేదికను సృష్టించడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య చర్చలు, దౌత్య సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యూఏఈలోని విద్యాశాఖ, పలువురు కీలక మంత్రులు, ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, విద్యావేత్తలు, ప్రవాసులు తదితరులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. రెండు దేశాల విద్య, నైపుణ్యాభివృద్ధి పర్యావరణ వ్యవస్థలకు సంబంధించి అవసరమైన ద్వైపాక్షిక చర్చలలో సైతం ఆయన పాల్గొననున్నారు. అంతేకాకుండా.. పలువురు వ్యాపారవేత్తలతో కూడా భేటీ అవుతారు. యూఏఈ తొలి రోజు పర్యటనలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ కోడింగ్ పాఠశాల 42 అబుదాబిని సందర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్..


‘‘ప్రాజెక్ట్ ఆధారిత, గేమిఫైడ్ పాఠ్యాంశాల ద్వారా ఆవిష్కరణ, సృజనాత్మకత, పీర్-టు-పీర్ లెర్నింగ్‌ను ప్రోత్సహించడంపై లోతైన దృష్టిని కలిగి ఉన్న కోడింగ్ పాఠశాల 42 అబుదాబిని సందర్శించాను. GCCలో మొదటి-రకం పాఠశాల 42అబుదాబి.. టెక్-ఎనేబుల్డ్ ఫ్యూచర్ దార్శనికతను గ్రహించడం కోసం విద్యకు ఉన్న అడ్డంకులను తొలగించడంపై థ్రస్ట్ ప్రశంసనీయమైనది. ఇది ఏడాది పొడవునా 24/7 తెరిచి ఉంటుంది.. ఇది అభ్యాసకులకు వారి షెడ్యూల్ ప్రకారం నేర్చుకోవడానికి.. నైపుణ్యాభివృద్దిని పెంపొందించుకోవడానికి సరైన సౌలభ్యాన్ని అందిస్తుంది. సులభంగా.. సౌలభ్యంగా నేర్చుకోవడం కూడా NEP 2020 ముఖ్య సిఫార్సు. అటువంటి ప్రగతిశీల మార్గాలను కలుపుకోవడం భారతదేశ ప్రతిభావంతులైన యువత.. శ్రామిక శక్తిని శక్తివంతం చేయడానికి ఒక మార్గం.. అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఎక్స్ (ట్విట్టర్) లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..