Dharmendra Pradhan: నగదు రూపంలో పెన్షన్లు.. ఒడిశా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

|

May 24, 2023 | 9:13 PM

సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్‌గా నగదు అందజేయాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుబట్టారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ ఆయన బుధవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. అలాగే పింఛన్‌ చెల్లింపు కోసం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) విధానాన్ని కొనసాగించాలని ఆ లేఖలో సీఎం నవీన్‌ కోరారు ప్రధాన్‌.

Dharmendra Pradhan: నగదు రూపంలో పెన్షన్లు.. ఒడిశా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
Dharmendra Pradhan
Follow us on

సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్‌గా నగదు అందజేయాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుబట్టారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ ఆయన బుధవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. అలాగే పింఛన్‌ చెల్లింపు కోసం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) విధానాన్ని కొనసాగించాలని ఆ లేఖలో సీఎం నవీన్‌ కోరారు ప్రధాన్‌. కాగా జూన్‌ నెల నుంచి రాష్ట్రంలోని పెన్షన్‌ లబ్ధిదారులందరికీ నగదు రూపంలో అందిస్తామని ఇటీవలే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒడిశా సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నగదు రూపంలో పెన్షన్‌ అందించే విషయంపై మరోసారి సమీక్షించాలని కోరుతూ ఒడిశా సీఎంకు లేఖ రాశారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. ‘పారదర్శకతను కొనసాగించడం, అలాగే అవినీతిని నిర్మూలించడంలో మా నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని, ఒడిశాలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ చెల్లింపు కోసం DBT విధానాన్ని కొనసాగించాలి. అలాగే నగదు చెల్లింపు నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. డీబీటీ విధానం వల్ల నకిలీ, బోగస్ లబ్ధిదారులను సులభంగా తొలగించవచ్చు. అలాగే ఈ విధానంలో దళారీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. ఇక నగదు చెల్లింపుల ద్వారా పెన్షన్‌ చెల్లించడం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉంది. మధ్యవర్తుల అవినీతి కారణంగా గతంలో చాలామంది లబ్ధిదారులు దోపిడీకి గురయ్యారు. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మళ్లీ అలాంటి అవకాశాలకు మరింత ఊతమిస్తుంది. అవినీతి, అక్రమాలను ప్రోత్సహిస్తుంది’ అని లేఖలో పేర్కొన్నారు ప్రధాన్‌.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న పథకాలన్నీ డీబీటీ విధానంలోనే నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన NSAP (జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం) కింద దేశంలోని 2.99 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో 20,95, 695 మంది ఒడిశా వాసులు ఉన్నారు. వీరంతా డీబీటీ విధానంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. డీబీటీ విధానంలో నకిలీ లబ్ధిదారుల తొలగించడం వల్ల ఒడిశా ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 459,96 కోట్లు ఆదా చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు రూ. 2.73 లక్షల కోట్లు ఆదా చేసింది’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..