Manipur Violence: మణిపూర్ అల్లర్లపై అమిత్ షా అఖిలపక్ష సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్లారంటే..?

|

Jun 24, 2023 | 3:54 PM

Manipur Violence: మణిపూర్‌‌లో నెల రోజులుగా సాగుతున్న అల్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. అమిత్‌షా అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హింసకు అడ్డుకట్ట వేసి, శాంతిని నెలకొల్పడానికి..

Manipur Violence: మణిపూర్ అల్లర్లపై అమిత్ షా అఖిలపక్ష సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్లారంటే..?
All Party Meeting On Manipur Violence
Follow us on

Manipur Violence: మణిపూర్‌‌లో నెల రోజులుగా సాగుతున్న అల్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.  అమిత్‌షా అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హింసకు అడ్డుకట్ట వేసి, శాంతిని నెలకొల్పడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా దేశంలోని వివిధ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అయితే మణిపూర్‌లో గత 50 రోజులుగా హింస యధేచ్చగా కొనసాగుతోందని, ఇంత ఆలస్యంగా ఎందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని కేంద్ర హోంశాఖను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించనున్నారు. వైసీపీ తరఫున ఎంపీ గురుమూర్తి బీఆర్‌ఎస్‌ తరపున మాజీ ఎంపీ వినోద్‌, శివసేన తరపున ప్రియాంకాచతుర్వుది, ఆర్జేడీ తరపున మనోజ్‌ కుమార్‌ ఝా సహా ఇతర పార్టీల నుంచి పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, మణిపూర్‌లో మే 3న ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. తెగల మధ్య మొదలైన ఈ వైరం తారాస్థాయికి చేరడంతో సైనిక బలగాలు, పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ఈ అల్లర్ల కారణంగా ఇప్పటివరకు 98 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. అంతకముందు హోంమంత్రి అమిత్ షా స్వయంగా అల్లర్లకు కారణమైన తెగల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా అల్లర్లు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 4న కేంద్ర హోంశాఖ ఆద్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుందని హోంశాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..