Nirmala Sitharaman: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌

|

Aug 24, 2021 | 6:37 AM

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాల రంగాల్లో నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Nirmala Sitharaman: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌
Nirmala
Follow us on

National Infrastructure Monetization Plan: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాల రంగాల్లో నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

ఆర్ధిక సంస్కరణలను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. రైల్వే, రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల రంగాల్లో నిధుల సమీకరణే లక్ష్యంగా కేంద్రం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను ప్రకటించింది. రానున్న నాలుగేళ్లలో ఈ కార్యక్రమం కింద 6 లక్షల కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. జాతీయ మానిటైజేషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రైల్వే, రోడ్లు, విద్యుత్‌ రంగాల్లో ఆస్తులను నిర్దిష్ట కాలానికి విక్రయించడం ద్వారా ఈ నిధుల సమీకరణ చేస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

ఆస్తులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి ఆస్తులనూ విక్రయించబోదని, వాటిని మెరుగైన పద్ధతిలో మాత్రమే ఉపయోగించుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఏయే రంగాల నుంచి ఎంతెంత సమీకరించనున్నదీ వివరించారు. రోడ్లు, ఎయిర్‌పోర్టులు, విద్యుత్, గ్యాస్‌పైప్‌లైన్‌లను విక్రయించాలని నిర్ణయించారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆస్తుల విక్రయాన్ని చేపట్టినట్టు నిర్మల వెల్లడించారు. కీల‌క రంగాలు మిన‌హా మిగ‌తా రంగాల‌ను ప్రైవేటిక‌రిస్తామని స్పష్టం చేశారు. ఆస్తుల యాజ‌మాన్య హ‌క్కులు మాత్రం ప్రభుత్వానికే ఉంటాయని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఓ అసాధారణ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా నిర్ణయం వెల్లడిస్తోంది. మౌలిక వసతుల రంగంలో ప్రైవేట్‌ -పబ్లిక్‌ భాగస్వామ్యానికి పెద్దపీట వేయాలన్న కృతనిశ్చయంతో కూడా కేంద్రం ఉంది.

వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌లో భాగంగా ఆస్తుల విక్రయాలు చేప‌ట్టినట్టు నిర్మలా సీతారామ‌న్ వెల్లడించారు. కీల‌క రంగాలు మిన‌హా మిగ‌తా రంగాల‌ను ప్రైవేటిక‌రించాల‌ని నిర్ణయించిన‌ట్లు సీతారామ‌న్ ప్రక‌టించారు. ఆస్తుల యాజ‌మాన్య హ‌క్కులు మాత్రం ప్రభుత్వానికే ఉంటాయని ఆమె స్పష్టంచేశారు.

Read Also…Ayurvedic-Home Tips: వంటిల్లే ఔషధాల గని.. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి వాటినుంచి ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి