Jawahar Navodaya Vidyalaya: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ప్రతి జిల్లాకు ఒక్క జవహర్ నవోదయ విద్యాలయం.. కేంద్రం కీలక ప్రకటన..
ఏపీలోని 13 జిల్లాల్లో జవహర్ నవోద విద్యాలయాలున్నాయి. అయితే వీటికి అదనంగా మరో రెండు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్..

Jawahar Navodaya Vidyalaya: కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రతి జిల్లాకు కనీసం ఒక్క జవహర్ నవోదయ విద్యాలయంను ఏర్పాటుకు సిద్ధంగా ఉందన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో జవహర్ నవోద విద్యాలయాలున్నాయి. అయితే వీటికి అదనంగా మరో రెండు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రకాశం (ఎస్సీ), తూర్పు గోదావరి (ఎస్టీ)లో ఈ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక-ఆర్థికాంశాలతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన, ఆధునిక విద్యను, విలువలు, సంస్కృతితో పాటు అందించడం, వారికి పర్యావరణ అవగాహన, సాహస కార్యాకలాపాలు, శారీరక శిక్షణ అందించడం కోసం జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేస్తోందన్నారు.
బదిలీలకు గురయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ, పారా-మిలటరీ బలగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిని ఏర్పాటు చేయడానికి తగిన అర్హతలుంటే, నియమ నిబంధనల ప్రకారం కొత్త కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలున్నాయని.. కొత్తగా మరో 11 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు ప్రతిపాదనలు అందాయన్నారు. ఇందులో అనకాపల్లి (విశాఖపట్నం), మాచెర్ల (గుంటూరు)లో ఏర్పాటు చేయడానికి అనుకూల పరిస్థితులున్నాయని.. మిగతా 9 ప్రతిపాదనల్లో కొన్ని లోపాలు, తేడాలు ఉన్నాయి.
కావలి (నెల్లూరు), కృష్ణాయపాలెం, శాఖమూరు, రొంపిచర్ల (గుంటూరు), మదనపల్లె (చిత్తూరు), రాయచోటి (కడప), నందిగామ, నూజివీడు (కృష్ణా), కోమలపూడి (విశాఖపట్నం) ప్రతిపాదనల్లో ఈ లోటుపాట్లు ఉన్నాయని కేవీ సంఘటన్ తెలిపింది
రొంపిచర్ల (గుంటూరు)లో కొత్త కేవీ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలన దశలో ఉంది. కేవీ ఏర్పాటు చేయడానికి ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 5 ఎకరాల స్థలంలో సగం లోతట్టు ప్రాంతంగా ఉందన్నారు. దీనికి మట్టి నింపాల్సిన అవసరం ఉందని. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌కు తెలియజేశామన్నారు.
ఇవి కూడా చదవండి: Cow: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. రైతు ఇంట్లో పండుగ శోభ..
Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..
