
రోజ్‌గార్ మేళా పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందిన 71,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 13 ఏప్రిల్, 2023 తేదీన ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
‘రోజ్‌గార్ మేళా’.. ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం. రోజ్‌గార్ మేళా ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, యువతకు సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలాను అందించాలనే లక్ష్యంతో పని చేస్తుందని ప్రభుత్వం చెబుతుంది.
దేశవ్యాప్తంగా కొత్తగా రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, సీనియర్ డ్రాట్స్‌మన్, JE/పర్యవేక్షకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచర్, లైబ్రేరియన్, నర్సు, ప్రొబేషనరీ ఆఫీసర్లు వంటి వివిధ ఉద్యోగాలు/పోస్టులలో చేరనున్నారు. కాగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు ద్వారా శిక్షణ ఇస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..