రాబోయే ఎన్నికల్లో అక్షరాస్యత ఉన్న వ్యక్తికి ఓటు వేయాలని విద్యార్థులను కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో సదరు ఉపాధ్యాయుడిని ఆ విద్యా సంస్థ విధుల్లోంచి తొలగించింది. టీచర్‌ని ఉద్యోగం నుంచి తొలగించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. అనాకాడెమీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పలువురు తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా గురువారం ఆగస్టు 17న ట్వీట్ చేశారు. ఆ తర్వాత అనాకాడమీ సహ వ్యవస్థాపకుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ లో ఉద్యోగం పోగొట్టుకున్న ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కరణ్ స్పందించారు. అందులో తానూ వివాదానికి కేంద్రంగా మారినట్టుగా చెప్పారు. జ్యుడీషియల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న తన స్టూడెంట్లు కూడా ఈ కాంట్రవర్సీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా తన పైనా ప్రతికూల ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
This teacher urged his students to vote for an educated leader, he didn’t take anyone’s name.
ఇవి కూడా చదవండిBJP supporters assumed that he was targeting Modi and they made pressure on the Unacademy.
Now he has lost his job. pic.twitter.com/f7olZ3Rr7d
— Shantanu (@shaandelhite) August 17, 2023
కరణ్ తన విద్యార్థులకు పాఠం చెప్పే సందర్భంగా చదువుకున్న వారికే ఓటేయాలని సూచించే వీడియో వివాదాస్పదంగా మారింది. విద్యావంతులైన అభ్యర్థులకు ఓటు వేయాలని ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు దేశాన్ని నిర్మించలేరని చెప్పారు. ఆ తర్వాత వీడియో వైరల్ కావటంతో అకాడమీ అతనిని తొలగించింది. తరగతి గది వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి స్థలం కాదని పేర్కొంది. Unacademy అనేది విద్య, అభ్యాస రంగంలో పనిచేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అని చెప్పారు. ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విద్యావంతులను ఓటు వేయమని విజ్ఞప్తి చేయడం నేరమా? ఎవరైనా నిరక్షరాస్యులైతే, నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను, కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదన్నారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యుగం. నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎన్నటికీ నిర్మించలేరని అరవింద్ కేజ్రీవాల్ సైతం స్పష్టం చేశారు.
क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023
అనాకాడెమీ సహ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ..
కరణ్ సంగ్వాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించారని, అందుకే కంపెనీ అతనిని తొలగించాల్సి వచ్చిందని అనాకాడెమీ సహ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ అన్నారు. ఆయన ట్వీట్ చేస్తూ, ఇక్కడ నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్న విద్యా వేదిక తమ కాలేజ్ అన్నారు. ఇందుకోసం తమ ఉపాధ్యాయులందరికీ కఠినమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నామని చెప్పారు. దీని లక్ష్యం ఇక్కడ చదువుకునే విద్యార్థులు నిష్పాక్షికమైన జ్ఞానాన్ని పొందేలా చేయడమేనని చెప్పారు. మనం చేసే ప్రతి పనికి మన అభ్యాసకులు కేంద్రంగా ఉంటారని ఆయన అన్నారు. తరగతి గది వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి స్థలం కాదన్నారు. ఎందుకంటే అవి వాటిని తప్పు మార్గంలో ప్రభావితం చేస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరణ్ సంగ్వాన్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున తాము అతన్ని విధుల్లోంచి తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…