G20 Digital Economy Ministers meeting: ఆ మూడు చాలా కీలకం.. జీ20 డిజిటల్ ఎకానమీ మినిస్టర్స్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్..
G20 Digital Economy Ministers meeting: డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ కోసం భారత ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు ప్రాధాన్యతలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం హైలైట్ చేస్తూ ప్రసంగించారు. G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ కోసం భారత ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు ప్రాధాన్యతలు.. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI), డిజిటల్ ఎకానమీలో భద్రత, డిజిటల్ స్కేలింగ్ అని..

G20 Digital Economy Ministers meeting: డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ కోసం భారత ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు ప్రాధాన్యతలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం హైలైట్ చేస్తూ ప్రసంగించారు. G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ కోసం భారత ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు ప్రాధాన్యతలు.. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI), డిజిటల్ ఎకానమీలో భద్రత, డిజిటల్ స్కేలింగ్ అని తెలిపారు. ఈ మూడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రాధాన్యతలు సురక్షితమైన, అందరినీ కలుపుకొని, అందరికీ సమానమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే విస్తృత గ్లోబల్ ఎజెండాకు సరిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ప్రజాస్వామ్యీకరణను ప్రధాని మోడీ నమ్ముతారు అని వైష్ణవ్ పేర్కొన్నారు. టెక్ రంగంలో ప్రపంచంలోని అత్యంత మార్గదర్శక కంపెనీలలో చాలా వరకు బెంగళూరులోనే ఉన్నాయని, దేశంలో బెంగళూరు ఆవిష్కరణకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి వైష్ణవ్.
‘డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నిర్వచించే, సమస్యలపై చర్చించడానికి తాము సమావేశమయ్యాము. ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన కంపెనీలకు బెంగళూరు నిలయంగా మారింది. G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశం ఆయా దేశాలు పరస్పరం సహకరించుకోవడానికి, ముఖ్యమైన సమస్యలపై సలహాలు, సూచనలను పంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తుందన్నారు.

G20 Digital Economy Ministers Meeting
సమావేశంలో చర్చల సమయంలో వినూత్న అంశాలు, సమస్యా పరిష్కారాలు, సహకార వ్యూహాలు ఉద్భవించవచ్చని అంచనా వేశారు కేంద్రమంత్రి. ఇది ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తీరును రూపొందిస్తుందన్నారు. మానవాళి అందరికీ ప్రయోజనం చేకూర్చే సాంకేతికతతో నడిచే భవిష్యత్తు గురించి ప్రధాని మోడీ దృష్టికి దోహదం చేస్తుందన్నారు కేంద్రమంత్రి వైష్ణవ్.
ఇదిలాఉంటే.. శనివారం జరిగిన జీ20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. భారతదేశంలో గత 9 సంవత్సరాలుగా అపూర్వమైన డిజిటల్ అభివృద్ధి కోసం 2015లో డిజిటల్ ఇండియా పథకం ప్రత్యేక చొరవ చూపిందని పేర్కొన్నారు. భారతదేశంలో డిజిటల్ డెవలప్‌మెంట్ అనేది అచంచలమైన నమ్మకం, వేగవంతమైన అమలుకు దాని నిబద్ధత ద్వారా శక్తి పొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలోని 850 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే డేటా పొందుతున్నారని చెప్పారు. ఇది భారతదేశ డిజిటల్ డెవలప్‌మెంట్ స్థాయిని, వేగాన్ని, పరిధిని నిదర్శనంగా నిలుస్తోందన్నారు.

G20 Digital Economy Ministers Meeting
జామ్ యోజన, జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు, ఆధార్, మొబైల్ నెంబర్‌తో చెల్లింపులు విప్లవాత్మక మార్పుగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. UPI చెల్లింపు వ్యవస్థ ద్వారా ప్రతి నెలా దాదాపు 10 బిలియన్ల లావాదేవీలు జరుగుతాయని, ప్రపంచవ్యాప్తంగా 45 శాతం రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని ఆయన ప్రస్తావించారు. డైరెక్ట్ బెనిఫిట్స్, ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌లోని లీకేజీలను ప్లగ్గింగ్ చేయడంపై కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన పన్నుల వ్యవస్థలు పారదర్శకత, ఇ-గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తున్నాయన్నారు ప్రధాని మోదీ.
వర్కింగ్ గ్రూప్ G20 వర్చువల్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిపోజిటరీని రూపొందిస్తున్నందుకు ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం కామన్ ఫ్రేమ్‌వర్క్‌లో పురోగతి అందరికీ పారదర్శక, జవాబుదారీ, న్యాయమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుందని ఉద్ఘాటించారు ప్రధాని. డిజిటల్ స్కిల్స్ క్రాస్ కంట్రీ కంపారిజన్, డిజిటల్ స్కిల్లింగ్‌పై వర్చువల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడానికి రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలను కూడా ఆయన స్వాగతించారు. భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న శ్రామికశక్తి అవసరాలను తీర్చేందుకు ఇవి ముఖ్యమైన ప్రయత్నాలని ప్రధాని పేర్కొన్నారు.

G20 Digital Economy Ministers Meeting
డిజిటల్ ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్నందున భద్రతాపరమైన బెదిరింపులు, సవాళ్లను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు ప్రధాన మంత్రి. సురక్షితమైన, విశ్వసనీయమైన, స్థితిస్థాపకమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం G20 ఉన్నత-స్థాయి సూత్రాలపై ఏకాభిప్రాయాన్ని నెలకొల్పడం చాలా ముఖ్యమని సూచించారు ప్రధాని మోదీ. గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్, ఆన్‌లైన్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్, ప్రక్రియలో పారదర్శకత, ప్రాబిటీని తీసుకువచ్చారని, ఇ-కామర్స్‌ను ప్రజాస్వామ్యం చేస్తున్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంశాలను కూడా ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
