Atique Ahmed: ప్రయాగ్‌రాజ్‌ జైలుకు మాఫియా డాన్‌ అతిక్‌ అహ్మద్‌.. 17 ఏళ్ల తర్వాత నేడు తీర్పు ఇవ్వనున్న కోర్టు

2005లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకేసులో అతిక్ అహ్మద్ నిందితుడు. అతిక్ అహ్మద్ అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు. మంగళవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది..

Atique Ahmed: ప్రయాగ్‌రాజ్‌ జైలుకు మాఫియా డాన్‌ అతిక్‌ అహ్మద్‌.. 17 ఏళ్ల తర్వాత నేడు తీర్పు ఇవ్వనున్న కోర్టు
Atique Ahmed

Updated on: Mar 28, 2023 | 7:35 AM

2005లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకేసులో అతిక్ అహ్మద్ నిందితుడు. అతిక్ అహ్మద్ అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు. మంగళవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అతిక్ అహ్మద్ 17 ఏళ్ల నాటి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసు విచారణ ఇప్పటికే పూర్తయింది. న్యాయమూర్తి డాక్టర్ దినేష్ చంద్ర శుక్లా ఈరోజు తీర్పు వెలువరించనున్నారు.

విచారణను పూర్తి చేసిన కోర్టు మార్చి 17న నిర్ణయాన్ని రిజర్వ్ చేసి మార్చి 28న నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పింది. 2005 జనవరి 25న బీఎస్పీ సీనియర్ నేత రాజుపాల్ హత్యకు గురయ్యారు. రాజుపాల్‌తో పాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. వారి పేర్లు దేవిలాల్ పాల్, సందీప్ యాదవ్. రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రధాన సాక్షి. కానీ, ఫిబ్రవరి 28, 2006న అతన్ని దుండగులు అపహరించారు. అతిక్ అహ్మద్, అతని అనుచరులపై ఆరోపణలు వచ్చాయి.

ఉమేష్ పాల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్, దినేష్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్ పేర్లు ఉన్నాయి. దీంతో పాటు ఇస్రార్, అబిద్ ప్రధాన్, జావేద్, ఫర్హాన్, మల్లి, ఎజాజ్ అక్తర్‌లపై కూడా కిడ్నాప్‌ ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం కేసులో 2009లో నిందితులపై కోర్టు అభియోగాలు మోపింది. అనంతరం కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి