Aadhaar violators: దేశంలో ఆధార్ వినియోగంలో తరచూ ఉల్లంఘనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. ఆధార్ చట్టం ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయిన. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ వ్యవస్థను నిర్వహిస్తున్న యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కే ఉల్లంఘటనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆధార్ చట్టం ఆమోదించిన రెండేళ్ల తర్వాత కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి ఉడాయ్‌కు (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) వీలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని కల్పించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్ల డేటకు మరింత రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు.
మార్గదర్శకాలు..
ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఉడాయ్ న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవచ్చు.
న్యాయనిర్ణేత అధికారులకు ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలు/వ్యక్తులపై విచారణ జరిపి రూ.1 కోటి వరకు జరిమానా విధించవచ్చు.
న్యాయనిర్ణేత అధికారులు ఇచ్చిన తీర్పుపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే సదరు సంస్థలు టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు.
ఈ నిబంధనల కోసం కేంద్రం ఆధార్, ఇతర శాసనాల (సవరణ) బిల్లుకి ఆమోదముద్ర వేసింది.
దీంతో ఈ చట్టాల అమలు, చర్యలకు రెగ్యులేటర్‌తో సమానమైన అధికారాలు లభించాయి.
Also Read: