UGC-NET Exams: యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. విద్యాశాఖ మంత్రి ట్విట్.. ఎప్పటినుంచంటే?

|

Feb 02, 2021 | 2:00 PM

యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2 నుంచి...

UGC-NET Exams: యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. విద్యాశాఖ మంత్రి ట్విట్.. ఎప్పటినుంచంటే?
University Grants Commission
Follow us on

UGC NET examination 2021: యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2 నుంచి 17వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తుందని ఫోఖ్రియాల్ ట్విట్ చేశారు. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఉద్యోగానికి అర్హత కోసం స‌బ్జెక్టుల వారీగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో మొత్తం 11 రోజులపాటు దేశవ్యాప్తంగా పరీక్షలు జ‌రుగుతాయ‌ని ఆయన వెల్లడించారు. పరీక్షలు రాసే అభ్యర్థులందరికీ గుడ్ లక్ అంటూ ఆయన ట్విట్ చేశారు.

జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో షిప్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా UGC-NET పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు ఆన్‌లైన్ పద్ధతిలో జరగనున్నాయి. అయితే యూజీసీ నెట్ పరీక్ష 2021 కు హాజరయ్యే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయొచ్చు.

Also Read:

Fact Check: ఢిల్లీ అల్లర్ల అనంతరం 200 మంది పోలీసులు రాజీనామా చేశారా? అసలు నిజాన్ని వెల్లడించిన పోలీసులు

ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు