Pushpa Dialogue: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరే నోట పుష్పరాజ్ డైలాగ్.. విషయం ఏంటంటే?

|

Aug 01, 2022 | 7:21 PM

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ క్రేజ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఆ సినిమాలోని తగ్గెదే లే డైలాగ్‌కు విపరీతమైన స్పందన లభిస్తోంది. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరే నోట ఈ డైలాగ్ వినిపించింది.

Pushpa Dialogue: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరే నోట పుష్పరాజ్ డైలాగ్.. విషయం ఏంటంటే?
Uddhav Thackeray
Follow us on

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ క్రేజ్ దేశ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఆ సినిమాలోని తగ్గెదే లే డైలాగ్‌కు విపరీతమైన స్పందన లభిస్తోంది. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరే నోట ఈ డైలాగ్ వినిపించింది. ల్యాండ్ స్కామ్ కేసులో ఈడీ చేత అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను అభినందిస్తూ ఉద్దవ్.. పుష్పా డైలాగ్ వాడారు. సంజయ్ రౌత్‌ను చూసి తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. తగ్గెదే లే అన్నట్లు సంజయ్ రౌత్ తీరు ఉందని అభినందించారు. శివసేన అసలైన శివసైనికుడని.. తలవంచబోరని అన్నారు. సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ముంబైలోని ఆయన నివాసానికి వెళ్లిన ఉద్దవ్.. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అదే సమయంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్ షిండే వర్గంపై ఉద్దవ్ థాకరే సెటైర్లు వేశారు. తలొగ్గబోమని చెప్పిన కొందరు నేతలు.. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారని పేర్కొన్నారు. సంజయ్ రౌత్‌ను పుష్ప మూవీలో పుష్పరాజ్‌తో పోల్చుతూ ఉద్దవ్ థాకరే కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.సోషల్ మీడియాలోనూ ఉద్దవ్ వీడియో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ల్యాండ్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన రెండు సమ్మన్లకు సంజయ్ రౌత్ హాజరుకాకపోవడంతో.. ఆదివారం సాయంత్రం ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అంతకు ముందు సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించి.. లెక్కల్లో చూపించని రూ.11.50 లక్షల నగదును సీజ్ చేసింది. ఆదివారం రాత్రి రౌత్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. స్పెషల్ సెషన్ కోర్టులో హాజరుపరుచగా కోర్టు ఆయన్ను ఆగస్టు 4 వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగించింది. రాజకీయ కక్షసాధింపుతోనే ఈడీని పావుగా వాడుకుని కేంద్ర ప్రభుత్వం సంజయ్ రౌత్‌ను వేధిస్తోందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి