UDAN SCHEME: సామాన్యులకు అందుబాటులో విమాన ప్రయాణం.. ఉడాన్ పథకంతో పట్టణాలకు ఎయిర్ సర్వీసెస్ ప్రారంభించామన్న కేంద్రప్రభుత్వం

|

Aug 08, 2022 | 2:15 PM

దేశ పౌర విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు. కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ సేవలను కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా జెండా ఊపి ప్రారంభించారు. ముంబయి నుంచి బయలుదేరిన

UDAN SCHEME: సామాన్యులకు అందుబాటులో విమాన ప్రయాణం.. ఉడాన్ పథకంతో పట్టణాలకు ఎయిర్ సర్వీసెస్ ప్రారంభించామన్న కేంద్రప్రభుత్వం
Jyotiraditya Scindia
Follow us on

Udan Scheme: దేశ పౌర విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు. కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ సేవలను కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా జెండా ఊపి ప్రారంభించారు. ముంబయి నుంచి బయలుదేరిన తొలి విమానం అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఈసందర్భంగా జ్యోతిరాధిత్య సింధియా మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం దశాబ్దకాలంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. గతంలో విమానయాన రంగంలోకి అనేక కొత్త సంస్థలు ప్రవేశించాయని.. అయితే గత పదేళ్లుగా అనేక సంస్థలు మూతపడ్డాయన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టితో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు విమానయాన సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. విమాన ప్రయాణం అంటే సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితమనుకునే పరిస్థితుల నుంచి ఉడాన్ పథకం ద్వారా విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని సింధియా తెలిపారు. ఎయిర్ కనెక్టివిటీని విస్తరించడంతో పాటు..గత ఐదేళ్ల కాలంలో లక్షా 50 వేలకు పైగా విమానాలను ప్రారంభించామన్నారు. ఉడాన్ పథకం ద్వారా ఈఘనతను సాధించామని తెలిపారు. తక్కువ ధరలకే విమాన టిక్కెట్లు సాధారణ ప్రజలకు అందుబాటులో వచ్చాయని పేర్కొన్నారు. 2టైర్, 3టైర్ నగరాలకు విమానయాన సేవలను విస్తరించి, మౌలిక సదుపాయాలను కల్పిచడం ద్వారా సామాన్య ప్రజల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి