ఈ మధ్య స్వలింగ సంపర్కులు ఒకరినొకరు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో రావడం చూస్తున్నాం. అయితే తాజాగా వరుసకు వదిన, మరదళ్లు అయ్యే ఇద్దరు యువతులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా బయ్ జోయ్ ప్రాంతంలో నివాసం ఉండే యువతి.. తన మరదలితో కలిసి నోయిలోని ఓ కంపెనీలో పనిచేసేది. అప్పుడు వారిద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే చిన్నతనం నుంచే వారు స్నేహంగా ఉండటంతో తమ కుటుంబ సభ్యులు సాదరణ స్నేహంలాగే చూశారు. కానీ ఆ వదినా మరదళ్లు మాత్రం అంతటితో ఆగకుండా ఏడు నెలల క్రితం ఇంట్లో నుంచి కూడా పారిపోయారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారికోసం ఎంత గాలించినా ఆచూకి దొరకలేదు. అయితే ఆదివారం రోజున వాళ్లిద్దరు బహ్ జోయ్ పోలీస్ స్టేషన్‌కు తిరిగివచ్చారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణకావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తాము అప్పటికే పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలిపారు. చివరికి వాళ్లిద్దరికి పోలీసులు సర్దిచెప్పారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్లను పంపించారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..