పండ్ల రసాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

|

Sep 05, 2023 | 2:55 PM

ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు అని అధికారి తెలిపారు. పేలుడు తీవ్రతకు యంత్రం భాగం మీటర్ల మేర ఎగిరి రోడ్డుకు అవతలివైపున్న పొలంలో పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

పండ్ల రసాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..
Blast
Follow us on

గుజరాత్‌లోని తాపీ జిల్లాలో కొత్తగా నిర్మించిన ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీర్‌పూర్ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పండ్లరసాల ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించే క్రమంలో పేలుడు సంభవించింది. 4.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఫ్యాక్టరీలో యంత్రాలను అమర్చుతుండగా ఓ భాగం పేలింది.

గుజరాత్‌లోని తాపీ జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ప్రమాదం కారణంగా..ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రిలో చేర్చారు. విర్‌పూర్ గ్రామంలో ఉన్న ఫ్రూట్ జ్యూస్ యూనిట్‌లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఐదుగురు కార్మికులు కర్మాగారంలో మెషినరీలను అమర్చుతుండగా, యంత్రంలో కొంత భాగం పేలిపోయిందని పోలీసు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు అని అధికారి తెలిపారు. పేలుడు తీవ్రతకు యంత్రం భాగం మీటర్ల మేర ఎగిరి రోడ్డుకు అవతలివైపున్న పొలంలో పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

సోమవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. భవనంలోని వారంతా గాఢ నిద్రలో ఉండగా బిల్డింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో శిథిలాల కింద పడి ఇద్దరు మృతి చెందినట్టుగా తెలిసింది.. ఇంకా భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూటీం బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం ఒడిశాలో పిడుగుల కారణంగా మృతుల సంఖ్య 12కి చేరింది. 14 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. ఒడిశాలో మూడు గంటల్లో 62,350 పిడుగులు నిరంతరంగా సంభవించాయి. మృతుల్లో నలుగురు ఖుర్దా జిల్లాకు చెందినవారు కాగా, ఇద్దరు బలంగీర్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..