చేయాలనే సంకల్పం ఉంటే మార్గం అదే కనిపిస్తుందని పెద్దల మాట. ఆ మాటను బాగా నమ్మినట్లున్నారు జార్ఖాండ్‌కి చెందిన ఇద్దరు మద్యం వ్యాపారులు. తన మద్యం రవాణా కోసం ఏకంగా అంబులెన్స్‌నే వాడేశారు. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా.. కాలం కలిసి రాక ఎక్సైజ్ శాఖ అధికారుల చేతులకు దొరికారు. అంబులెన్స్‌లో శవపేటికలో దాచిపెట్టి జార్ఖండ్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే ఆరోపణలపై బీహార్‌లోని గయాలో ఇద్దరు వ్యక్తులను సోమవారం అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
ఇక నిందితులు రాంచీకి చెందిన లలిత్ కుమార్ మహ్తో, జార్ఖండ్‌లోని చత్రా జిల్లాకు చెందిన పంకజ్ కుమార్ యాదవ్ మద్యం అక్రమ రవాణా కోసం అంబులెన్స్‌లో శవపేటికను ఉంచారు. వాటిని గుర్తించిన పోలీసులు శవపేటికలో ఉన్న వివిధ బ్రాండ్లకు చెందిన 212 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం నిందితులు జార్ఖండ్ నుంచి ఎన్‌హెచ్19 మీదుగా రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గయా జిల్లాలోని దోభి చెక్‌పోస్టు వద్ద వారిని అడ్డుకున్నారు.
ఈ విషయంపై గయా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ దీపక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘మేము జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే వాహనాలను సాధారణ తనిఖీలు చేస్తున్నాము. ఈ క్రమంలోనే NH19 మీదుగా అంబులెన్స్ రావడాన్ని గుర్తించగా, మా సిబ్బంది దానిని ఆపారు. మేము డ్రైవర్ లలిత్ మహ్తోను అడిగినప్పుడు, శవపేటికలో మృతదేహం ఉందని చెప్పాడు. బదులుగా మేము శవపేటికను తెరవమని వారిని అడిగితే వారు తడబడ్డారు. దీంతో మాకు అనుమానం వచ్చి దానిని తరిచి చూడగా అందులోవివిధ బ్రాండ్లకు చెందిన 212 మద్యం సీసాలు అందులో కనిపించాయ’ని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..