Lok Sabha Election: ఒకే విమానంలో ఇద్దరు ప్రత్యర్థి నేతలు.. ఢిల్లీ చేరుకున్న నితీష్ కుమార్, తేజస్వి యాదవ్

2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు మెజార్టీని సాధించింది. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ మూడోసారి అధికారంలోకి రానుంది. ఎన్డీఏ కూటమి 292సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి.

Lok Sabha Election: ఒకే విమానంలో ఇద్దరు ప్రత్యర్థి నేతలు.. ఢిల్లీ చేరుకున్న నితీష్ కుమార్, తేజస్వి యాదవ్
Nitish Kumar, Tejashwi Yadav

Updated on: Jun 05, 2024 | 4:30 PM

2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు మెజార్టీని సాధించింది. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ మూడోసారి అధికారంలోకి రానుంది. ఎన్డీఏ కూటమి 292సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి

అయితే కేంద్రంలో అధికారం చేపట్టాలంటే మొత్తం 543 లోక్‌సభ సీట్లకు గానూ 272 సీట్లు సాధించాలి. ఎన్టీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు ఈజీ అయింది. మూడోసారి మోదీ 3.0 సర్కార్ అధికారంలోకి రానుంది. కౌంటింగ్ సమయంలో ఒక దశలో అధికారం సాధించే మెజార్టీపై కాస్త ఆందోళన కలిగింది. అయినా మళ్ళీ కూటమి పుంజుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బీహార్ పొలిటికల్ కారిడార్‌లో సందడి నెలకొంది. ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. యావత్ దేశం చూపు ఆయనపైనే ఉంది.

ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు నితీశ్‌ కుమార్‌ ఢిల్లీ వెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సీఎం నితీశ్ కుమార్ వెళ్తున్న విమానంలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. నేతలిద్దరూ కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సమయంలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఇరువురు నేతలూ పక్క పక్కనే కూర్చుని కనిపించారు. టేకాఫ్ కాగానే సీఎం నితీశ్ కుమార్ సీటు వెనుక తేజస్వి యాదవ్ కూర్చున్నారు. మరో చిత్రంలో సీఎం నితీశ్ కుమార్ పక్కన తేజశ్వి కూర్చొని కనిపించారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లడంతో రాజకీయ వర్గాలలో ఊహాగానాల పర్వం వేడెక్కింది.

బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌తో పాటు తేజస్వి యాదవ్ ఢిల్లీ చేరుకున్నారు. అయితే వీరిద్దరూ వేర్వేరు సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లారు. కీలకమైన ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, అలాగే ఇండి కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ ఉదయం ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఇద్దరు నేతలు ఒకే విమానంలో కూర్చున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

వీడియో చూడండి… 

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) సీనియర్ నేతలు బుధవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్‌తో పాటు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి, హెచ్‌ఏఎం అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ హాజరుకానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఎన్డీయే సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ నేతలు ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…