Jammu: జమ్మూకశ్మీర్‌లో విషాదం.. గోడ కూలి ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి.. మరొక జవానుకు తీవ్ర గాయాలు
జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటు చోటు చేసుకుంది. గోడ కూలి ఇద్దరు జవాన్లు మరణించారు. మరో జవానుకు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ....
జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటు చోటు చేసుకుంది. గోడ కూలి ఇద్దరు జవాన్లు మరణించారు. మరో జవానుకు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి కథువాలోని ముచ్చేదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కథువాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్లావర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ముచ్చేదిలో ఆర్మీ జవాన్లు బ్యారక్‌లో పని చేస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారిపై గోడ కూలింది. దీంతో సుబేదార్ ఎస్‌ఎన్ సింగ్, నాయక్ పర్వేజ్ కుమార్, సిపాయి మంగళ్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే వారిని చికిత్స నిమిత్తం బిల్లావర్‌లోని ఆస్పత్రికి తరలించగా, ఎస్ ఎన్ సింగ్, పర్వేజ్‌లు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక మంగళ్ సింగ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం పఠాన్‌కోట్‌కు తరలించారు. మృతి చెందిన ఎస్‌ఎన్ సింగ్ స్వస్థలం హర్యానాలోని సోనేపట్ కాగా, పర్వేజ్‌ది సాంబా, గాయపడిన మంగళ్ సింగ్‌ది పానిపట్‌కు చెందిన వారు. వీరి మృతితో ఇరు కటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Afghanistan Airstrike: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ వైమానిక దాడి..ఏడుగురు తాలిబాన్ ఉగ్రవాదుల హతం