Twitter: దారిలోకి వస్తున్న ట్విట్టర్.. భారత్‌లో రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ నియమకం.. ఎవరంటే..?

| Edited By: Shaik Madar Saheb

Jul 11, 2021 | 12:14 PM

Twitter India: భారత్ తీసుకువచ్చిన ఐటీ సంస్కరణలకు వ్యతిరేకంగా ట్విట్టర్ గత కొంత కాలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కొన్నిరోజులుగా ట్విట్టర్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్

Twitter: దారిలోకి వస్తున్న ట్విట్టర్.. భారత్‌లో రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ నియమకం.. ఎవరంటే..?
Twitter
Follow us on

Twitter India: భారత్ తీసుకువచ్చిన ఐటీ సంస్కరణలకు వ్యతిరేకంగా ట్విట్టర్ గత కొంత కాలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కొన్నిరోజులుగా ట్విట్టర్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ తన తీరును మార్చుకుంది. భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేందుకు సమయాత్తమైంది. దీంతో న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూల్స్‌పై ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య ప్రతిష్టంభన తొలగే అవకాశం కనిపిస్తోంది. ఈ నిబంధనలకు అనుగుణంగా తాజాగా భారత్‌లో రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు ట్విట్టర్ ఆదివారం ప్రకటించింది. రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌గా వినయ్ ప్రకాశ్‌ను నియమించినట్లు ట్విట్టర్ తెలియజేసింది. దీంతోపాటు దేశంలో ట్విట్టర్‌ను సంప్రదించవలసిన చిరునామాను కూడా తెలిపింది. నాలుగో అంతస్థు, ది ఎస్టేట్, 121 డికెన్సన్ రోడ్, బెంగళూరు. పిన్ : 560042లో వినయ్ ప్రకాశ్‌ను సంప్రదించవచ్చునని తెలిపింది. దీంతోపాటు యూజర్లు grievance-officer-in @ twitter.com ద్వారా రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ వినయ్ ప్రకాశ్‌ను సంప్రదించవచ్చునని ట్విట్టర్ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

కొత్త ఐటీ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, గ్రీవియెన్స్ ఆఫీసర్‌లను నియమించాలని ఐటీ మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు స్పష్టంచేసింది. యూజర్ల సంఖ్య 5 మిలియన్ల కన్నా ఎక్కువ ఉన్న సామాజిక మాధ్యమాల సంస్థలు ఈ ముగ్గురు అధికారులను తప్పనిసరిగా నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు ఈ అధికారులంతా దేశంలోనే నివసించాలని పేర్కొంది.

2021 మే 26 నుంచి జూన్ 25 వరకు కాంప్లియెన్స్ రిపోర్టును కూడా ట్విట్టర్ ప్రచురించింది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం.. ఈ నివేదికను ప్రచురించడం కూడా తప్పనిసరి కానుంది. కాగా.. ట్విటర్ అంతకుముందు ధర్మేంద్ర చతుర్‌ను తాత్కాలిక రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌గా నియమించింది. అయితే ఆయన గత నెలలో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కాగా.. గ్రీవెన్స్ ఆఫీస‌ర్‌ను నియామకంపై ఢిల్లీ హైకోర్టులో సైతం విచారణ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు 8 వారాల పాటు గడువు కోరిన ట్విట‌్టర్.. నాలుగు రోజుల్లోనే నియ‌మించింది.

Also Read:

కిమ్ తో జింగ్ భాయీ..భాయీ..విదేశీ శక్తులు ఒక్కటవుతున్న వేళ..మేమిద్దరం..ఎవరికీ బెదరం

తాలిబన్ల జోరు..ఆఫ్ఘనిస్తాన్ నుంచి 50 మంది అధికారులను ఖాళీ చేయించిన ప్రభుత్వం