TV9 WITT Summit 2024: ప్రపంచం చూపు భారత్ వైపు.. అగ్రభాగాన ఆర్థిక వ్యవస్థ.. టీవీ9 సమ్మిట్‌లో కీలక చర్చ..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక వృద్దిపై సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది. దీనికి కారణం మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే.. అయితే, ప్రస్తుతం ప్రపంచం చూపు భారత్ పై నెలకొంది.. భారత ఆర్థిక వ్యవస్థ నేడు అంతర్జాతీయంగా చర్చల్లో నిలిచింది. ఈ క్రమంలో.. భారత ఆర్థిక వ్యవస్థ.. వృద్ధిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి.. ప్రపంచం చూపు భారత్ పై ఎందుకు ఉంది..

TV9 WITT Summit 2024: ప్రపంచం చూపు భారత్ వైపు.. అగ్రభాగాన ఆర్థిక వ్యవస్థ.. టీవీ9 సమ్మిట్‌లో కీలక చర్చ..
Pm Modi

Edited By:

Updated on: Feb 24, 2024 | 5:46 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక వృద్దిపై సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది. దీనికి కారణం మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే.. అయితే, ప్రస్తుతం ప్రపంచం చూపు భారత్ పై నెలకొంది.. భారత ఆర్థిక వ్యవస్థ నేడు అంతర్జాతీయంగా చర్చల్లో నిలిచింది. ఈ క్రమంలో.. భారత ఆర్థిక వ్యవస్థ.. వృద్ధిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి.. ప్రపంచం చూపు భారత్ పై ఎందుకు ఉంది.. అనే విషయాలను TV9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ 2024 రెండవ ఎడిషన్ లో కీలక చర్చ జరగనుంది. ఫిబ్రవరి 25 – 26 తేదీలలో న్యూఢిల్లీ వేదికగా TV9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ 2024 జరగనుంది. ప్రముఖులు, నాయకుల ఆలోచనల పరంగా.. ఈ వేదికగా కీలక చర్చ జరగనుంది. ఈ సంవత్సరం సమ్మిట్ థీమ్ ‘ఇండియా: తదుపరి బిగ్ లీప్ కోసం సిద్ధంగా ఉంది’. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ఆశాజ్యోతిగా భారతదేశం స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిస్తుంది.

జపాన్, బ్రిటన్ మాంద్యంలోకి జారిపోయిన తర్వాత.. జర్మనీ కూడా అదే బాటలో నిలిచింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం 2027 నాటికి ఆర్థిక ఉత్పత్తి పరంగా ఈ దేశాలను అధిగమించగలదు.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ.. భారతదేశ వృద్ధి ఈ సంవత్సరం 6.2 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.

భారత్ విజయగాథ..

మౌలిక సదుపాయాలు, పెట్టుబడి, ఉత్పత్తి, స్వదేశీకరణ భారతదేశ వృద్ధి విజయానికి కీలక స్తంభాలుగా ఉన్నాయి. డిజిటలైజేషన్‌ను అనుసరించడం ద్వారా, భారతదేశం చాలా తక్కువ వ్యవధిలో తన వృద్ధి ప్రయాణాన్ని వేగంగా అత్యున్నత స్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బలమైన ప్రభుత్వం.. మన రాష్ట్రాలను గతంలో కంటే బలంగా మార్చింది.

చాలా సందర్భాలలో ఇది ఒక నాయకుడి దూరదృష్టి.. తెరపైకి వస్తుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి చెప్పుకోదగిన అంశాలను తెరపైకి వచ్చాయి. బీహార్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘ఇండియా: నెక్స్ట్ బిగ్ లీప్‌కి సిద్ధంగా ఉంది’ అనే ఈ పెద్ద కథనం.. ప్రకారం.. ఇప్పుడు ప్రతి రాష్ట్రం పోటీ పడుతోంది.. సహకరిస్తోంది.. భాగస్వామ్యమవుతుంది..

భారతదేశం అభివృద్ధి వెనుక దశాబ్దాల కృషి ఉంది. భౌగోళిక రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి భారత్ ఓ మంచి ఎంపిక.. భారత్ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంది.. ఎలాంటి మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే మెరుగైన వృద్ధి రేటును ఎలా అధిగమించింది.. అనేది అంతర్జాతీయంగా చర్చజరుగుతోంది. అంతేకాకుండా, వ్యవస్థలు బలంగా ఉన్న.. న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థలు పటిష్టంగా ఉన్న ప్రజాస్వామ్య దేశంతో వ్యవహరించడానికి ప్రపంచానికి మరింత సౌకర్యం ఉంది.

బుల్లెట్ ప్రూఫ్ ఆర్థిక వ్యవస్థ..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే.. మాంద్యంతో సంక్షోభంలో చిక్కుకున్న దేశాలకంటే భారతదేశం ముందుంది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత గత రెండేళ్లలో సరైన నిర్ణయాలు తీసుకుంది. ఎక్కువ ఖర్చు చేయకుండా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటి జీవితాలను మార్చిన టెక్నాలజీలో భారతదేశం పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా.. పెట్టుబడిదారులకు కూడా పలు మార్గాలను సుగమం చేసింది.

భారతదేశ జనాభా డివిడెండ్, ఈ శతాబ్దం మధ్యకాలం వరకు బాగానే ఉంటుంది. ఇది కూడా దేశానికి అనుకూలంగా పనిచేస్తుంది. చైనా సగటు వయస్సు 50 ఏళ్లు ఉన్నప్పుడు, భారతదేశం 38 ఏళ్ల వయస్సులో ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా పనిచేసే జనాభా భారతదేశంలోనే ఉంటుంది.

మున్ముందు.. ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు, ఆర్థిక వ్యవస్థలు భారత్ వెనుక వరుసలో ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు.. ప్రతి ఒక్కరూ భారతదేశం ఆర్థిక వ్యవస్థతోపాటు ముందుకు వెళ్లేలా.. ఆర్థిక రంగంలో రాణించేందుకు దేశంతో సఖ్యతను కోరుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..