TV9 Network: టీవీ9 నెట్‌వర్క్ సరికొత్త అధ్యాయం.. అందుబాటులోకి మరో డిజిటల్ ఛానల్.. రాయ్‌పూర్ కాన్‌క్లేవ్‌‌ వేదికగా..

|

Jul 16, 2022 | 12:17 PM

స్థాపించిన అనతికాలంలోనే TV9 నెట్‌వర్క్ 1.1 బిలియన్లకు పైగా నెలవారీ యూట్యూబ్ వ్యూస్‌తో ప్రేక్షకులకు మరింత చేరువైంది.

TV9 Network: టీవీ9 నెట్‌వర్క్ సరికొత్త అధ్యాయం.. అందుబాటులోకి మరో డిజిటల్ ఛానల్.. రాయ్‌పూర్ కాన్‌క్లేవ్‌‌ వేదికగా..
Tv9 Network
Follow us on

TV9 Chhattisgarh digital channel: టీవీ9 నెట్‌వర్క్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. TV9 నెట్‌వర్క్ హిందీతోపాటు తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో కొనసాగుతూ.. దేశంలోనే అతిపెద్ద టెలివిజన్ న్యూస్ నెట్‌వర్క్‌గా సత్తచాటుతోంది. ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది. ఛత్తీస్‌గడ్‌లో సైతం డిజిటల్ ఛానెల్‌ను స్థాపించి తనదైన ముద్రను వేసుకుంది. స్థాపించిన అనతికాలంలోనే TV9 నెట్‌వర్క్ 1.1 బిలియన్లకు పైగా నెలవారీ యూట్యూబ్ వ్యూస్‌తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. TV9 నెట్‌వర్క్ ఛత్తీస్‌గఢ్ డిజిటల్ ఛానెల్‌తోపాటు హిందీ భాషలోని ఏడు రకాల మార్కెటింగ్ విభాగాలలో (HSM) ఛానళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాయ్‌పూర్‌లో ‘బైఠక్ ఛత్తీస్‌గఢ్’ పేరుతో శనివారం ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ డిజిటల్ ఛానల్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, జమ్మూ & కాశ్మీర్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో సాటిలేని మీడియో పవర్‌హౌస్‌ను నిలిచింది.

ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ హాజరై ప్రసంగించనున్నారు. Chhattisgarh HSM Digital Channel ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖులు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై మాట్లాడనున్నారు.

TV9 ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ డిజిటల్ ఛానెల్‌ని ఇటీవల ప్రారంభిన విషయం తెలిసిందే. ఆ తర్వాత TV9 ఛత్తీస్‌గడ్ డిజిటల్ ఛానల్‌ను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే TV9 నెట్‌వర్క్‌ పోల్ పొజిషన్ డిజిటల్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ HSM డిజిటల్ ఛానల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని.. TV9 రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తోంది. దీంతోపాటు నిర్ణయాత్మక అంశాలు, రాబోయే రాష్ట్ర ఎన్నికలు.. సమస్యల పరిష్కారాలు తదితర అంశాలపై చర్చ నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు TV9 నెట్‌వర్క్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రక్తిమ్ దాస్ మాట్లాడుతూ.. భారతీయ భాషల్లోని ప్రాంతీయ, హైపర్-లోకల్ కంటెంట్ డిజిటల్ మీడియా భవిష్యత్తును నడిపిస్తుందన్నారు. హిందీ మార్కెట్‌లో ఛానల్‌ను మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్‌లో నాయకత్వంతో పాటు, TV9 నెట్‌వర్క్ డిజిటల్ ఛానల్‌లో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. రికార్డు సమయంలో నెలవారీగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధిస్తున్నట్లు వివరించారు.

Source Link

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి