సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ టీవీ 9 నెట్‌వర్క్ ప్రతిష్ఠాత్మకంగా అందజేసే నక్షత్ర అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ అవార్డు అందుకున్నందుకు టీవీ 9 నెట్‌వర్క్ కు, తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ‘పుష్ప 2’ షూటింగ్ కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. అయితే వీడియో మెసేజ్ ద్వారా క్షమాపణలు చెప్పి అవార్డును తన అభిమానులకు అంకితమిచ్చారు అల్లు అర్జున్. టీవీ 9 నెట్‌వర్క్ ఏర్పాటు చేసిన వాట్ ఇండియా థింక్స్ టుడే మొదటి రోజు కార్యక్రమానికి దేశంలోని చాలా ప్రముఖ తారలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ టీవీ 9 నెట్‌వర్క్ నక్షత్ర అవార్డును అందుకున్నారు.
‘పుష్ప’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. అయితే టీవీ 9 నెట్‌వర్క్‌కి, తన అభిమానులకు వీడియో సందేశం ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లాడు. దీంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. దీంతో ఆయన కార్యక్రమానికి రాలేకపోయారు. అయితే వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ, నక్షత్ర అవార్డు అందించినందుకు టీవీ9 నెట్‌వర్క్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. 2024 ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కానుంది. దానివల్ల నేను ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయానన్నారు. ఈ అవార్డును తన అభిమానులకు అంకితమిచ్చారు. అభిమానుల ఆదరాభిమానాలు లేకుంటే ఇది సాధ్యం కాదని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..