Ghorer Bioscope: టీవీ9 బంగ్లా అవార్డు కార్యక్రమంలో పుష్ప ప్రస్తావన.. సీఈఓ బరున్‌దాస్ ఏమన్నారంటే

| Edited By: Ram Naramaneni

Dec 02, 2024 | 11:18 PM

నిజానికి అల్లు అర్జున్‌ ఈ అవార్డుల వేడుకకు హాజరుకావాల్సి ఉందని కానీ కొన్ని కారణాల వల్ల రాలేదని బరుణ్‌ దాస్‌ చెప్పుకొచ్చారు. ఇక పుష్ప2 సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోన ఏకంగా రూ. 50 కోట్లు దాటిందని ఆయన తెలిపారు. తొలిరోజు కలెక్షన్లు రూ. 300 కోట్లకుపైగా రాబట్టొచ్చని ఆయన అంచనా వేశారు. ప్రాంతయ నటుడైన అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా హీరోగా రాణించారని బరుణ్‌...

Ghorer Bioscope: టీవీ9 బంగ్లా అవార్డు కార్యక్రమంలో పుష్ప ప్రస్తావన.. సీఈఓ బరున్‌దాస్ ఏమన్నారంటే
Tv9 Ceo Barun Das
Follow us on

టీవీ9 బంగ్లా సోమవారం గోరర్ బయోస్కోప్‌ పేరుతో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది గోరర్ బయోస్కోస్‌ రెండవ ఎడిషన్ కావడం విశేషం. ఈ అవార్డుల కార్యక్రమంలో బెంగాలీ టెలివిజన్‌ సీరియల్స్‌, ఓటీటీ ప్రాజెక్టుల ప్రతిభను గుర్తిస్తూ అవార్డులు అందిస్తుంటారు. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమానికి పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రముఖ సినీ, టీవీ సీరియల్‌ తారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరున్‌ దాస్‌. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్‌ గురించి ప్రస్తావించారు.

నిజానికి అల్లు అర్జున్‌ ఈ అవార్డుల వేడుకకు హాజరుకావాల్సి ఉందని కానీ కొన్ని కారణాల వల్ల రాలేదని బరుణ్‌ దాస్‌ చెప్పుకొచ్చారు. ఇక పుష్ప2 సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోన ఏకంగా రూ. 50 కోట్లు దాటిందని ఆయన తెలిపారు. తొలిరోజు కలెక్షన్లు రూ. 300 కోట్లకుపైగా రాబట్టొచ్చని ఆయన అంచనా వేశారు. ప్రాంతయ నటుడైన అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా హీరోగా రాణించారని బరుణ్‌ దాస్‌ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది బెంగాలీ చిత్ర పరిశ్ర రూ. 100 కోట్లు సంపాదించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

ఇక ఎరిక్‌ వీనర్ అనే రచయిత గురించి ప్రస్తావించిన బరుణ్‌ దాస్‌.. ‘ఎరిక్‌ వీనర్‌ ప్రపంచంలోని అత్యంత సృజనాత్మక ప్రదేశాలను శోధించి వాటికి సంబంధించిన వివరాలను ఒక పుస్తకంలో ప్రచురించారు. ఆయన రాసిన పుస్తకంలో వెనిస్, ఫ్లోరెన్స్‌తో పాటు కోల్‌కతా కూడా ఉంది. ఈ పుస్తకం నిజంగా గొప్పది, కోల్‌కతా ఒక సృజనాత్మక నగరం అని నేను అతనితో ఏకీభవిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక
సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్ పేరును మాట్లాడుతూ.. “ఒకప్పుడు బెంగాళీ చిత్ర పరిశ్రమ బాలీవుడ్‌ను శాసించిందని తెలిపారు. భారతదేశంలోని ముగ్గురు అతిపెద్ద దర్శకులు సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్ బెంగాలీలే అని తెలిపారు. ఆ రోజులు మళ్లీ తిరిగి తీసుకురాలేమా అని చెప్పుకొచ్చారు.

బెంగాలీ టెలివిజన్‌కి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బరున్ దాస్ మాట్లాడుతూ, “బెంగాలీ టెలివిజన్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం రిత్విక్ ఘటక్ 100వ జయంతి. 2023లో మృణాల్ సేన్ 100వ జయంతిని జరుపుకున్నామని తెలిపారు. ఓటీటీ ఇప్పుడు బెంగాలీ చిత్ర పరిశ్రమకు సహాయం చేయగలదని బరుణ్‌ దాస్‌ అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కడైనా ఏదైనా చూడగలరు. కొరియన్‌ థ్రిల్లర్‌ డ్రామా స్క్విడ్‌ గేమ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపిందో ఈ సందర్భంగా బరుణ్‌ దాస్‌ గుర్తు చేశారు. బెంగళూరు ఐటీ రంంలో భారత సిలికాన్‌ వ్యాలీగా మారిందని, అలాంటప్పుడు బెంగాల్‌ ఎందుకు కాదని బరుణ్‌ దాస్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…