Tahawwur Rana: పాక్‌ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌ను.. తహావుర్‌ రాణా సంచలన వ్యాఖ్యలు

ముంబైల దాడుల సూత్రధారి తహావుర్‌ రాణా తాను పాక్‌ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌ అని తెలిపాడు. ISI తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు వెల్లడించాడు. ముంబై దాడుల సమయంలో అక్కడే ఉన్నట్టు రాణా ఒప్పుకున్నాడు. కాబూల్‌లో భారత ఎంబసీపై దాడికి కూడా ఐఎస్‌ఐ కుట్ర కారణమని తెలిపాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలో ఉన్న తహవ్వూర్ హుస్సేన్ రాణా పలు కీలక విషయాలను వెల్లడించాడు.

Tahawwur Rana: పాక్‌ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌ను.. తహావుర్‌ రాణా సంచలన వ్యాఖ్యలు
Tahawwur Rana

Updated on: Jul 07, 2025 | 9:09 PM

ముంబై దాడుల సూత్రధారి తహావుర్‌ రాణా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ ఆర్మీకి తాను నమ్మకమైన ఏజెంట్‌ అని వెల్లడించారు. లష్కర్‌ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థ దగ్గర తాను ట్రయినింగ్‌ తీసుకున్నట్టు వెల్లడించాడు. ISI తో పాటు పాకిస్తాన్‌ సైన్యంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు వెల్లడించాడు. ముంబై దాడులకు ముందు CST దగ్గర తానే స్వయంగా రెక్కీ నిర్వహించినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఆఫ్గన్‌ రాజధాని కాబూల్‌లో భారత ఎంబసీపై దాడికి కూడా ISI కుట్రే కారణమని వెల్లడించాడు.

తహావుర్‌ రాణాను అమెరికా ప్రభుత్వం కొద్ది నెలల క్రితం భారత్‌కు అప్పగించింది. ముంబై క్రైంబ్రాంచ్‌ విచారణలో రాణా ఈ సంచలన విషయాలను వెల్లడించాడు. పాక్‌ సైన్యం , ISIకి సంబంధించిన చాలా విషయాలను ముంబై పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం రాణా జాతీయ దర్యాప్తు సంస్థ .. NIA కస్టడీలో ఉన్నాడు. ముంబై సహా భారత్‌లోని వివిధ ఉగ్రదాడుల విషయంలో రాణా పాత్రపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో రాణా సంచలన విషయాలు వెల్లడించాడు. అంతేకాకుండా అప్పట్లో తాను పాకిస్థాన్‌ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌గా వ్యవహరించానని ఆయన పేర్కొన్నాడు..

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలో ఉన్న తహవ్వూర్ హుస్సేన్ రాణా.. విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.. 2008 ముంబై ఉగ్రవాద దాడులలో సహాయకుడిగా ఉన్నానని.. పాకిస్తాన్ సైన్యానికి “విశ్వసనీయ ఏజెంట్”గా చురుకైన పాత్ర పోషించానని అంగీకరించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయని.. పలు జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.

ముంబైలో ఉగ్రదాడులు జరుగుతున్న సమయంలో..

ముంబైలో ఉగ్రదాడులు జరుగుతున్న సమయంలో రాణా అక్కడే ఉన్నట్టు సంచలన విషయం బయటపడింది. ముంబైలో రద్దీగా ఉండే చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్, తాజ్ హోటల్, ఇండియా గేట్, నారీమన్ పాయింట్ వంటి ప్రదేశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే ముంబైలో ఒక ఇమ్మిగ్రేషన్ సెంటర్ ను ప్రారంభించాలని రాణా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జరిపిన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా తన వ్యాపార ఖర్చులు గా చూపించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ గూడచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్లు రాణా పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తహావుర్‌ రాణా పాకిస్తాన్ మూలాలు ఉన్న కెనడియన్ పౌరుడు. . అతడిని ఖలీజ్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ ఆర్మీ తరపున సౌదీ అరేబియా కు పంపించారు. అప్పటినుంచి అతడికి పాకిస్తాన్ ఆర్మీతోను ఐఎస్ఐ తోను ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. అలాగే తహవూర్ రాణా, డేవిడ్ హెడ్‌లీ ఇద్దరూ కలిసి లష్కరే తాయిబాతో కలిసి సి ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నారు. దీంతో పాటు ఇద్దరు గూడచారులుగా పని చేశారు. 2024 లో అమెరికా సుప్రీంకోర్టు ఆదేశం మేరకు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించారు. 2025 మే నెలలో తహవూర్ రాణాను భారత్ కు తీసుకొని వచ్చి విచారణ జరుపుతున్నారు.

ప్రస్తుతం రాణా తీహార్ జైలులో ఉన్నారు. 2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ముంబై నగరంలోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఉగ్రవాద దాడిలో మొత్తం 166 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా తాజ్ హోటల్. ఛత్రపతి శివాజీ టెర్మినార్ రైల్వే స్టేషన్, నారీమాన్ హౌస్ వంటి ప్రాంతాల్లో తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకులను చంపేశారు. అయితే భద్రతా దళాల ప్రతిఘటనలో తీవ్రవాదులు మరణించగా, ఒక తీవ్రవాది కసబ్ ను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరిపి ఉరిశిక్ష విధించి అమలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..