హౌడీమోడీ మెగా ఈవెంట్ వెనుక .. ట్రంప్ ‘ ట్రేడ్ డీల్ ‘ !

| Edited By: Ram Naramaneni

Sep 21, 2019 | 6:33 PM

టెక్సాస్ లో ఆదివారం ఘనంగా జరగనున్న హౌడీ మోడీ మెగా ఈవెంట్ కి హాజరు కావాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనుక ఓ పెద్ద వ్యూహమే ఉంది. ముఖ్యంగా టారిఫ్ ల విషయంలో భారత, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 28 వస్తువులపై ఇండియా అత్యధికంగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. ఇందుకు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన […]

హౌడీమోడీ మెగా ఈవెంట్ వెనుక .. ట్రంప్  ట్రేడ్ డీల్  !
Follow us on

టెక్సాస్ లో ఆదివారం ఘనంగా జరగనున్న హౌడీ మోడీ మెగా ఈవెంట్ కి హాజరు కావాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనుక ఓ పెద్ద వ్యూహమే ఉంది. ముఖ్యంగా టారిఫ్ ల విషయంలో భారత, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 28 వస్తువులపై ఇండియా అత్యధికంగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. ఇందుకు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఇండియాను టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు. భారత ప్రభుత్వ చర్యవల్ల తమ దేశ ఆదాయానికి గండి పడిందని అప్పట్లోనే ఆయన వాపోయారు. అలాగే ఇండియా నుంచి తాము దిగుమతి చేసుకునే సరకులపైనా సుంకాలు పెంచుతామని బీరాలు పలికారు. అయితే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్, పీనట్స్ వంటివాటిపై పెంచిన సుంకాలను కొనసాగిస్తూ వస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖలోని ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రభుత్వ చర్యను సమర్థించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ మెగా ఈవెంట్ సందర్భంగా ప్రధాని మోడీ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి.. అందుకు అనువుగా ఓ ట్రేడ్ డీల్ కుదుర్చుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అసలే చైనా తోనూ అమెరికాకు ఇలాంటి టారిఫ్ చిక్కులే ఉన్నాయి. ఇప్పుడు భారత ప్రభుత్వంతో ‘ సమస్య ‘ ను పరిష్కరించుకుంటే.. ఆ తరువాత ఆ దేశంతో కూడా ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్ఛు. ఇప్పటికే మోడీ, ట్రంప్ ఈ స్వల్ప కాలంలో దాదాపు మూడు సార్లు భేటీ అయ్యారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఈ సారి వీరిద్దరూ మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మోడీ వెంట వెళ్లిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికన్ వాణిజ్య ప్రతినిధులతో భేటీ అయి.. ఈ టారిఫ్ సమస్య పరిష్కారానికి అనువుగా ఒప్పందానికి రావచ్చ్చునని భావిస్తున్నారు. హౌడీ మోడీ ఈవెంట్ ని ట్రంప్ ఇలా వినియోగించుకుంటారని నిపుణులు ఇదివరకే నిర్ధారణకు వచ్చారు కూడా. ఆదివారం టెక్సాస్ లోని హూస్టన్ లో ఈ ఈవెంట్ జరగబోతోంది.