TRS: ప్రధాని మోదీపై టీఆర్ఎస్ యుద్ధం.. ఉభయసభల్లోనూ ప్రివిలేజ్‌ మోషన్ నోటీసులు..

|

Feb 10, 2022 | 4:39 PM

ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సమితి(TRS). తెలంగాణ బిల్లును ఉద్దేశించి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాటలపై గరగరం అవుతోంది. ఉభయసభల్లోనూ ప్రివిలేజ్‌ మోషన్ నోటీసులను అందించారు TRS ఎంపీలు.

TRS: ప్రధాని మోదీపై టీఆర్ఎస్ యుద్ధం.. ఉభయసభల్లోనూ ప్రివిలేజ్‌ మోషన్ నోటీసులు..
Trs Mps Move Privilege Moti
Follow us on

Lok Sabha – TRS: ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సమితి(TRS). తెలంగాణ బిల్లును ఉద్దేశించి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాటలపై గరగరం అవుతోంది. ఉభయసభల్లోనూ ప్రివిలేజ్‌ మోషన్ నోటీసులను అందించారు TRS ఎంపీలు. పార్లమెంట్‌, సభాపతులను అగౌరవపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు టీఆర్ఎస్ MPలు. ఉదయం రాజ్యసభలోనూ నోటీసులు ఇచ్చారు.. అటు మోదీ కామెంట్స్‌కు నిరసనగా లోక్‌సభలో TRS ఎంపీలు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం ముందు ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు..

ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. టీఆర్ఎస్(TRS) ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన విషయంలో పార్లమెంటును, సభాపతిని అవమానపరిచేలా ప్రధాని మాట్లాడారని రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో అభ్యంతరం తెలిపారు.

మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన మోడీ, కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును తొందరపడి ఆమోదించడాన్ని తప్పుబట్టారు. ఎటువంటి చర్చ లేకుండా ఫిబ్రవరి 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యతిరేకం కాదని పేర్కొంటూనే, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మైకులు కట్ చేశారని, తలుపులు మూసివేశారని, కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారని ప్రధాని అన్నారు. “విభజన బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించడం జరిగింది. విభజన ప్రక్రియపై వాటాదారులతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదు, దీని కారణంగా రెండు వైపులా ఇంకా ఆందోళనలు కొనసాగుతోంది” అని ఆయన అన్నారు.

ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ ఉద్యమాన్నే అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు చేపట్టి ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రజలకు మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లజెండాలు పట్టుకుని మోటార్‌సైకిల్‌ ర్యాలీలు నిర్వహించి, ప్రదర్శనలు నిర్వహించి, నల్ల బెలూన్‌లను గాలిలోకి వదిలారు.

ఇవి కూడా చదవండి: Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు…

UP Assembly Election 2022 Phase 1 Polling Live Updates: మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 35.03 శాతం ఓటింగ్‌