బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరో వివాదాన్ని ఎదుర్కొంది. ఆసన్ సోల్ లో ఈ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఒకరు వ్యాక్సిన్ క్యాంపులో ఓ మహిళకు వ్యాక్సిన్ ఇచ్చిన వైనం తాలూకు వీడియో వైరల్ గా మారింది. ఎలాంటి అనుభవం లేకున్నా ఆమె టీకామందు ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది. ఈ పార్టీ నేతలు బాబుల్ సుప్రియో, అగ్నిమిత్ర పాల్ దీన్ని షేర్ చేశారు. తబస్సుమ్ ఆరా అనే ఈ కౌన్సిలర్-నర్సు తనకు ఓ ఇంజెక్షన్ ఇవ్వగా దాన్ని ఓ మహిళకు వ్యాక్సిన్ ఇచ్చినట్టే చేసింది. నిజానికి తాను టీకామందు ఇవ్వలేదని,తాను చేతిలో సిరంజి మాత్రం పట్టుకున్నానని ఆమె చెప్పింది స్కూల్లో తను నర్సింగ్ కోర్సు చదివానని కూడా పేర్కొంది. ఇలా సిరంజిని పట్టుకుని వ్యాక్సిన్ పట్ల అందరికీ అవగాహన కలిగేలా చేసేందుకే నేను ప్రయత్నించాను అని తబస్సుమ్ చెప్పింది. కానీ ఈ వీడియోను బాబుల్ సుప్రియో సీఎం మమతా బెనర్జీకి ట్యాగ్ చేస్తూ.. మీ ప్రభుత్వానికి అధికారులపై కంట్రోల్ అంటూ లేకపోయిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. మీ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్.. అనేకమంది అమాయకుల ప్రాణాలను రిస్క్ లో పెట్ట్టిందన్నారు.
ఆసన్ సోల్ ఎమ్మెల్యే అయిన అగ్నిమిత్ర పాల్ కూడా ఆయనతో ఏకీభవిస్తూ.. ఆ తబస్సుమ్ అనే మహిళ నిజంగా వ్యాక్సిన్ ఇచ్చినా..ఇవ్వకున్నా ఇది మీ పార్టీ నిర్వాకాన్ని చూపుతోందన్నారు. ఇలాంటివారిని మీ పార్టీ ఆదరిస్తోందన్నారు. ఇటీవలే కోల్ కతా లో జరిగిన ఫేక్ వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశవ్యాప్త సంచలనమైంది. ఓ నకిలీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో జరిగిన ఈ వ్యాక్సిన్ క్యాంపులో చివరకు ఓ నటి, పాలక పార్టీ ఎంపీ కూడా ‘దీని బారిన పడిన విషయం విదితమే.
మరిన్ని ఇక్కడ చూడండి:ఆషూ రెడ్డి అడవి పంది అంటూ రచ్చ.. అషూ రెడ్డి వీడియో లీక్ చేసిన యాంకర్ రవి..:anchor ravi on ashu reddy video.