దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం వణికించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆదివారం సాయంత్రం 4.08 గంటల ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. అక్టోబరు 3న ఇదే విధమైన బలమైన కుదుపులు సంభవించాయి. ఆదివారం నాటి భూకంపం తీవ్రత 3.1గా నమోదైంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం ఫరీదాబాద్‌కు తూర్పున తొమ్మిది కిలోమీటర్లు, ఢిల్లీకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎలాంటి నష్టం, ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.
ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. పశ్చిమ నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు బలమైన ప్రకంపనలను అనుభవించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. దేశంలో సంభవించిన వరుస భూకంపాలలో ఇది అత్యంత బలమైనది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించిన వెంటనే, నెటిజన్లు ఈ వార్తలను X ద్వారా వైరల్‌గా మార్చేశారు.
Earthquake of Magnitude:3.1, Occurred on 15-10-2023, 16:08:16 IST, Lat: 28.41 & Long: 77.41, Depth: 10 Km ,Location: 9km E of Faridabad, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/bTcjyWm0IA @KirenRijiju @Dr_Mishra1966 @moesgoi @Ravi_MoES pic.twitter.com/gG5B4j3oBs
— National Center for Seismology (@NCS_Earthquake) October 15, 2023
ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా మరోమారు భూమి కంపించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. ప్రాంతీయ రాజధాని హెరాత్‌కు వెలుపల 34 కిలోమీటర్ల దూరంలో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, గతంలో సంభవించిన బలమైన భూకంపాలు వేలాది మందిని మింగేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో భూ కంపం పెను విధ్వంసాన్ని మిగిల్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..