
వేసవి, వర్షాకాలంలో చాలా అడవి జంతువులు తరచూ అడవి నుండి బయటకు వస్తుంటాయి. ఆహారం, నీళ్ల కోసం జనావాసాల్లోకి వచ్చిన అడవి జంతువులు మనుషులపై దాడి చేస్తుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సిధీ జిల్లాలో ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు అడవి ఎలుగుబంటిని వెంబడించారు. ఈ సమయంలో ఎలుగుబంటి ఒక గిరిజన రైతుపై దాడి చేసి చంపేసింది. ఎలుగుబంటి గ్రామంలోకి ప్రవేశిస్తుందనే భయంతో స్థానిక ప్రజలంతా భయంతో వణికిపోయారు.
మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో దారుణం జరిగింది. ఎలుగు బంటి దాడిలో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. బస్తువా గ్రామంలో సోమవారం ఉదయం జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి ప్రజలపై దాడి చేసింది. ఈ దాడిలో బబ్బు యాదవ్(80), ఆయన కొడుకు సంతోష్ యాదవ్(43), దీన్‌బంధు సాహు(70) మరణించారు. ఏడుగురికి గాయాలు కాగా, వారిలో మనీష్ సాహు పరిస్థితి విషమంగా ఉంది. ఆగ్రహించిన గ్రామస్తులు ఎలుగును వెంటాడి హతమార్చారు.
ఎలుగుబంటి దాడి గ్రామంలో భయాందోళనలు సృష్టించింది. గ్రామస్తులందరూ గుమిగూడి ఎలుగుబంటిని చుట్టుముట్టి చంపారు. సంఘటన సమాచారం అందిన వెంటనే, అటవీ, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాంతీయ ఎమ్మెల్యే కున్వర్ సింగ్ టేకం కూడా సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..