Corona Vaccination Update: ఇప్పటి వరకూ దేశంలో 7.86 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రిత్వశాఖ

|

Jan 20, 2021 | 9:34 PM

Corona Vaccination Update: దేశంలో కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. దాదాపు ఏడాదిగా అతలాకుతలం చేసిన కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌...

Corona Vaccination Update: ఇప్పటి వరకూ దేశంలో 7.86 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రిత్వశాఖ
Follow us on

Corona Vaccination Update: దేశంలో కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. దాదాపు ఏడాదిగా అతలాకుతలం చేసిన కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా శ్రమించాయి. అయితే దేశంలో ఐదో రోజు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రం వరకు దేశంలో 7.86 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేసినట్లు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, బుధవారం ఒక్క రోజే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షా 12 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని వెల్లడించింది. ఇందులో కేవలం 10 మందికి మాత్రమే స్వల్ప ఇబ్బందులు తలెత్తాయని, ఢిల్లీలో నలుగురు, కర్ణాటకలో ఇద్దరు, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్లో ఒకరు చొప్పున స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపింది. భారత్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇప్పటి వరకు ఎవ్వరూ తీవ్ర అస్వస్థతకు గురైన దాఖలాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నాని తెలిపారు.

Also Read:

Corona Vaccine: కరోనా టీకా సీలు తెరిస్తే ఆ సమయంలోగా వాడేయాలి.. లేదంటే నిర్వీర్యమే.. వైద్య నిపుణుల సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో వేగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తెలంగాణలో 13,666 మందికి.. ఏపీలో 18,917 మందికి టీకాలు