Shahid Jameel: కోవిడ్ పాండమిక్ అదుపులో ప్రభుత్వం విఫలం, కరోనా కట్టడి ఫోరానికి సీనియర్ వైరాలజిస్ట్ గుడ్ బై

| Edited By: Janardhan Veluru

May 17, 2021 | 10:20 AM

కరోనా వైరస్ పై గల వివిధ వేరియంట్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోరం నుంచి సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ వైదొలిగారు.

Shahid Jameel: కోవిడ్ పాండమిక్ అదుపులో ప్రభుత్వం విఫలం, కరోనా కట్టడి ఫోరానికి సీనియర్ వైరాలజిస్ట్ గుడ్ బై
Virologist Shahid Jameel Quits From Covid Panel
Follow us on

కరోనా వైరస్ పై గల వివిధ వేరియంట్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోరం నుంచి సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ వైదొలిగారు. ఈ పాండమిక్ ను హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఆయన..తన రాజీనామాకు స్పష్టంగా కారణాలు వెల్లడించలేదు. అయితే రాయిటర్స్ వార్తా సంస్థకు పంపిన మెసేజ్ లో.. తన నిర్ణయానికి కారణం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం మీద దేశంలో వ్యాక్సినేషన్ కొరత, తక్కువగా టెస్టింగులు చేయడం, హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ సైతం అతి తక్కువ స్థాయిలో ఉండడం వంటి కారణాలే ఇండియాలో ఈ మహమ్మారి వ్యాప్తికి దోహదపడుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ లో రాసిన ఓ ఆర్టికల్ లో పేర్కొన్నారు.ఇండియాలో తన సహ శాస్త్రజ్ఞులు కూడా తనతో ఏకీభవిస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా వైరస్ కి సంబంధించి ప్రభుత్వం ఓ పాలసీని రూపొందించిందని, దీనికి డేటా విషయంలో తగినన్ని ఆధారాలు కావాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. వేరియంట్లపై మరింత పోరాటానికి, అధ్యయనానికి, ఈ వైరస్ ను అదుపు చేయడానికి అవసరమైన డేటా తమకు అందుబాటులో ఉండాలంటూ ఏప్రిల్ 30 న 800 మంది శాస్త్రజ్ఞులు ప్రధానికి విజ్ఞప్తి చేశారని షాహీద్ జమీల్ పేర్కొన్నారు. డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి జరుగుతున్న జాప్యం కూడా ఇండియాలో పాండమిక్ వ్యాప్తికి కారణమని, దీన్ని అదుపు చేయలేకపోతే ఇది శాశ్వత మచ్చగా మిగిలిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ సార్స్ కొవ్ -2 జీనోమిక్స్ కన్సార్షియా అడ్వైజరీ గ్రూప్ లో షాహిద్ ఒకరు. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ కోవిద్ ను సర్కార్ అదుపు చేయలేకపోయిందన్నది ఆయన అభిప్రాయం.

దేశంలో కరోనా వైరస్ కి సంబంధించిన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని ఆయన గత మార్చి నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం బీ 1.617 వేరియంట్ ఇండియాలో ప్రబలంగా ఉంది. వేలాది కోవిడ్ మరణాలకు ఈ వేరియంట్ కారణమవుతోందన్న అభిప్రాయం ఉంది. లక్షలాది మందితో కుంభమేళా, ప్రధాని మోదీ సహా వివిధ రాజకీయ నేతల ఎన్నికల ర్యాలీలు వంటివి కూడా ఈ వైరస్ వ్యాప్తికి కార‌ణ‌మ‌య్యాయ‌ని అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పసిబిడ్డను ఆడించిన గొరిల్లా…!! నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

Viral Video: చేప మేడలో మెరిసిన వెడ్డింగ్ రింగ్ మ్యాట‌ర్ ఏంటంటే… ( వీడియో )

Surekha Vani: పవన్ కళ్యాణ్‌కి 100 ముద్దులు… సీక్రెట్స్ బయటపెట్టిన సురేఖా వాణి.. ( వీడియో )