Pralay Missile Test: భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం.. ప్రళయ్‌ను మరోసారి పరీక్షించిన DRDO

|

Dec 23, 2021 | 11:54 AM

 భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ప్రళయ్‌ క్షిపణి పరీక్షను మరోసారి విజయవంతంగా నిర్వహించింది డీఆర్‌డీవో(DRDO).

Pralay Missile Test: భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం.. ప్రళయ్‌ను మరోసారి పరీక్షించిన DRDO
Pralay
Follow us on

భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ప్రళయ్‌ క్షిపణి పరీక్షను మరోసారి విజయవంతంగా నిర్వహించింది డీఆర్‌డీవో(DRDO). ఒడిశా లోని బాలాసోర్‌ కేంద్రం నుంచి మిస్సైల్‌ పరీక్షను నిర్వహించింది. బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించి డీఆర్‌డీవో మరోసారి తమ సత్తాను చాటింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ఘన-ఇంధన, యుద్ధభూమి క్షిపణి భారతీయ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం నుండి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించబడింది. ‘ప్రళయ్’ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు ఇతర కొత్త సాంకేతికతలతో పనిచేస్తుంది. DRDO ప్రకారం, క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో అత్యాధునిక నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి.

ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఓడించే విధంగా అధునాతన క్షిపణిని అభివృద్ధి చేశారు. ఇది గాలిలో నిర్దిష్ట పరిధిని కవర్ చేసిన తర్వాత దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బుధవారం క్షిపణి పరీక్ష తర్వాత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ తొలి అభివృద్ధి కోసం DRDO ,అనుబంధ బృందాలను అభినందించారు. ఆధునిక ఉపరితలం నుండి ఉపరితల క్షిపణిని వేగంగా అభివృద్ధి చేయడంతోపాటు మరోసారి విజయవంతంగా ప్రయోగించినందుకు DRDOని కూడా ఆయన అభినందించారు.

ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్‌.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..