Pregnancy First, Marriage Later : టోడతెగలో వింత ఆచారం.. అబ్బాయితో గడిపిన అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే పెళ్లి… ఎక్కడంటే…!

| Edited By: Team Veegam

Mar 23, 2021 | 2:21 PM

అడవి తల్లి బిడ్డలు.. ఆదివాసీ తెగల్లో అనేక సంప్రదాయాలు.. వింతలు విడ్డూరలు ఉన్నాయి.. ఒక్కొక్క గిరిజన తెగకు ఒక్కొవిధంగా సంప్రదాయం ఉంటుంది.. తాజాగా టోడ అనే గిరిజన తెగ.. వీరు ఓ వింత ఆదివాసీలు.. ఎందుకు వింత అంటే....

Pregnancy First, Marriage Later : టోడతెగలో వింత ఆచారం.. అబ్బాయితో గడిపిన అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే పెళ్లి... ఎక్కడంటే…!
Toda Tribes
Follow us on

Pregnancy First, Marriage Later : అడవి తల్లి బిడ్డలు.. ఆదివాసీ తెగల్లో అనేక సంప్రదాయాలు.. వింతలు విడ్డూరలు ఉన్నాయి.. ఒక్కొక్క గిరిజన తెగకు ఒక్కొవిధంగా సంప్రదాయం ఉంటుంది.. తాజాగా టోడ అనే గిరిజన తెగ.. వీరు ఓ వింత ఆదివాసీలు.. ఎందుకు వింత అంటే.. వీరు చేసిన పని ఏదైనా వింతగా కొత్తగా అనిపిస్తుంది.. ఈ టోడ ఆదివాసీయులు తమిళనాడు లోని నీలరిగిరి అడవుల్లో ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే.. ఈ తెగ ఉదగమండలం అంటే ఊటీ కు సమీపంలో గల అడవుల్లో ఉంటారు. ఈ తెగ స్పెషాలిటీ ఏమిటంటే….? వారి పెళ్లిళ్లూ… ఎంతో వింతగా.. వినడానే ఆశ్చర్యం గొలిపేవిధంగా ఉంటాయి. మరి ఏమిటా టోడ తెగ పెళ్లిళ్ల స్పెషాలిటీ అంటే…

టోడ గిరిజన తెగ వారు పెళ్లి జరుగుతున్న సమయంలో ఎటువంటి వేడుకలను నిర్వహించరు. చాలా సింపుల్ గా పెళ్లివేడుకను నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత పెళ్లి కూతురు.. పెళ్ళికొడుకుతో గడుపుతుంది.. ఆ సమయంలో పెళ్లి కూతురు నెల తప్పాల్సిందే.. అనంతరం ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుంది.. ఒక వేళ గర్భం రాకపోతే ఆ అబ్బాయి వద్దకు మరో ఇద్దరు అమ్మాయిల్ని పంపిస్తారు. వారికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ అబ్బాయి పెళ్లి లేకుండా జీవితాంతం ఒంటరిగా జీవించాల్సిందే.

అమ్మాయి తన తల్లిదండ్రుల వెళ్లిన తర్వాత గర్భం వస్తే.. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి భార్యగా పరిగణిస్తారు.. అప్పుడు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. భార్య గర్భిణిగా ఉన్న ఏడో నెలకు భర్త అడవికి వెళ్ళి… చెట్టు కాండంతో వీళ్ళు, బాణం తయారు చేసి.. భార్యకు ఇవ్వాలి.. అలా భర్త చేసిన బాణం భార్యకు నచ్చితే.. ఆ బాణం, విల్లు తీసుకొంటే… అప్పుడు అతడిని తన భర్త అంగీకరించడమే కాదు.. తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిగా కూడా ఒప్పుకొంటుంది.. అనంతరం విల్లు, బాణం వేడుక జరుగుతాయి.. ఈ వేడుకలు ఆ ప్రాంతంలో ఓ రేంజ్ లో జరుగుతాయి.. ఈ విల్లు బాణం సంబరాలు అంబరాన్ని అంటుతాయి. సంప్రదాయ బద్దమైన డ్యాన్సులతో పాటలతో రంగురంగుల దుస్తులతో ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకొంటారు. ఈ విల్లు బాణం వేడుకల్లో విదేశీయులు కూడా ఎంతో సంతోషంగా పాల్గొంటారు.. ఈ వేడుకలు పూర్తి అయ్యాక పెద్దల ఆశీర్వాదంతో అప్పటి నుంచి భార్యాభర్తల్లా ఆ జంట జీవితాంతం కలిసి ఉంటారు.. ఆధునిక జీవనం అంటూ మనిషి ఎంత ముందుకు పోతున్నా.. ఈ అడవి బిడ్డలు తమ సంప్రదాయం ని కాపాడుకోవడం లో ముందుటారు.. ఇక టోడ గిరిజన తెగ బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా జీవిస్తున్నారు.

Also Read:  ఏదో అనుకున్న కానీ రానా చాలా ఎదిగిపోయాడు.. ఎమోషనల్ అయిన వెంకీమామ

 ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో “గో మహా గర్జన” : యుగతులసి ఫౌండేషన్ చైర్మన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!