మరో నరబలి..! జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. ప్రియుడికి విషమిచ్చి హత్య చేసిన ప్రియురాలు..

|

Oct 31, 2022 | 7:54 AM

యువతితో కలిసి బయటకు వెళ్లిన ప్రతిసారీ షారన్‌కు కడుపునొప్పి వస్తోందని ఆరోపించారు. ఆ విధంగా పోలీసులు నిందితురాలు గ్రీష్మను ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించగా ఆమె తన నేరాన్ని అంగీకరించింది.

మరో నరబలి..! జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. ప్రియుడికి విషమిచ్చి హత్య చేసిన ప్రియురాలు..
Poison
Follow us on

యావత్‌ దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన కేరళలోని పతంతిట్ట జిల్లాలో జరిగిన నరబలి కేసు తర్వాత.. తిరువనంతపురంలోని పరశాలలో మరో షాకింగ్ హత్య కేసు ఉదంతం వెలుగు చూసింది. జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఓ యువతి విషం తాగించి ప్రియుడిని హతమార్చిన దారుణ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన ప్రేమికుడు షారోన్ కాగా, ప్రేమికుడిని హత్య చేసిన నిందితురాలు గ్రీష్మగా తెలిసింది. వీరిద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఓ సైనికుడితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ తను ప్రేమించిన అబ్బాయిని దూరం చేసుకోవడం ఇష్టం లేదు.

ఇదిలా ఉండగా నవంబరులోపు పెళ్లి చేసుకుంటే ప్రేమికుడు చనిపోతాడని జ్యోతిష్యుడు యువతికి చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని యువతి తను ప్రేమించిన యువకుడి దృష్టికి తీసుకెళ్లింది. గ్రీష్మకు జ్యోతిష్య సమస్యలు ఉన్నాయని, తన మొదటి భర్త చనిపోతాడని, ఆమె రెండవ వివాహంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ఆమె బలంగా నమ్మింది. కానీ, ఈ జ్యోతిష్య అంచనా తప్పని, గ్రీష్మను వెట్టుకాడు చర్చిలో పెళ్లి చేసుకున్నాడు షారోన్‌. ఇదే అదునుగా ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు కలిసి పన్నిన పన్నాగమేనని బంధువులు ఆరోపిస్తున్నారు.

గత నెల 14న తమిళనాడులోని రామవర్మంచిరలో ఉన్న యువతి ఇంటికి షారోన్ వెళ్లాడు. అక్కడ యువతి కాపర్ సల్ఫేట్ కలిపిన రసాన్ని ఇచ్చింది. అలాగే యువతితో కలిసి బయటకు వెళ్లిన ప్రతిసారీ షారన్‌కు కడుపునొప్పి వస్తోందని ఆరోపించారు. ఆ విధంగా పోలీసులు నిందితురాలు గ్రీష్మను ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించగా ఆమె తన నేరాన్ని అంగీకరించింది. అలాగే ఇందుకు నిదర్శనంగా వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ లు కూడా వెలుగులోకి రావడంతో.. జ్యూస్ ఛాలెంజ్ పేరుతో షరాన్ కోసం గ్రీష్మా జ్యూస్ తాగించిన సంగతి తెలిసింది.. అలా నిత్యం అతనిపై విషప్రయోగం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి