Cyclone Asani: ఈ ఏడాది తొలి తుఫాన్ దూసుకొస్తోంది. ‘ఆసని’ తుఫాన్ మార్చి 21న ఏర్పడే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అయితే ఈ తుఫాన్ భారత తీరం తాకే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇక హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం సాయంత్రం ఏర్పడిన అల్పపీడనం, బుధవారం మధ్య దక్షిణ బంగాళాఖాతం మీదుగా ప్రయణిస్తోంది. అనంతరం మార్చి 19 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ మీదుగా కదులుతూ, అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనంతరం నికోబార్ దీవులు మీదుగా ప్రయణించి మార్చి 20 నాటికి అల్పపీడనంగా మారి, మార్చి 21వ తేదీన అసని తుఫానుగా మారుతుందని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఈ తుఫాన్ కారణంగా అండమాన్, నికోబార్ దీవుల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మార్చి 18 వరకు బంగాళఖాతం, హిందూ మహా సముద్ర మీదుగా గంటలకు 40 నుంచి 50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మార్చి 21 నాటికి ఈ వేగం క్రమంగా పెరుగుతూ.. ఏకంగా గంటకు ఏకంగా 70 నుంచి 80 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఇక మార్చి 23న బంగాళ ఖాతం, బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల్లో గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: ఐపీల్ లో ఎక్కువ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుంది వీరే
Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..
Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్.. కట్ చేస్తే ఊహించని సీన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..