Viral Video: వందేళ్ల బామ్మ అందమైన జీవితానికి ఐదు సూత్రాలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Viral video: వందేళ్ల వయసున్న ఓ భామ అందమైన జీవితానికి ఐదు సూత్రాలను వెల్లడించారు. లియోనారా రేమాండ్ అనే బామ్మ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ చిన్న వీడియోను..
Viral Video: వందేళ్ల వయసున్న ఓ భామ అందమైన జీవితానికి ఐదు సూత్రాలను వెల్లడించారు. లియోనారా రేమాండ్ అనే బామ్మ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ చిన్న వీడియోను తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో ద్వారా ఎంతో మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. అందమైన డ్రెస్ ధరించి, తలపై టోపీ పెట్టుకుని ఉండి వెనుక నుంచి వచ్చే పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ ఐదు సూత్రాలను చెబుతున్న ఈ వీడియో హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన అధికారిక ఖాతాలో పోస్టు చేశారు.
ఖచ్చితంగా అవసరం వచ్చేంత వరకు ఒంటరిగా ఉండండి. మీ స్మార్ట్ ఫోన్‌లను విసిరేయండి, ప్రతి సంవత్సరం ఒక నెల జీతం ఆదా చేసుకోండి. జీవితాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. బాధతో ఉన్నవారికి మీ చిరునవ్వు ఇవ్వండి అని ఐదు సూత్రాలను తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో 50 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన ఎందరో తమకు ఎంతో నచ్చిందని, తప్పకుండా పాటించాల్సిన అంశాలని, థాంక్యూ బామ్మ అని నెటిజన్లు కామెంట్లు చేస్తూ అభినందనలు తెలిపారు.
View this post on Instagram