మిజోరాంలో ఒకేరోజు వ‌రుస‌గా మూడు సార్లు భూకంపం

| Edited By:

Aug 28, 2020 | 12:27 PM

మిజోరాంలోని తూర్పు ఛాంపై జిల్లాలో గురువారం సాయంత్రం గంటల‌ వ్య‌వ‌ధిలో మూడు సార్లు భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై ప్ర‌కంప‌న‌ల తీవ్ర 3.6 నుంచి 5.3 వ‌ర‌కు న‌మోదైన‌ట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. తూర్పు ఛాంపై జిల్లా కేంద్రానికి నైరుతి దిశ‌లోని..

మిజోరాంలో ఒకేరోజు వ‌రుస‌గా మూడు సార్లు భూకంపం
Follow us on

మిజోరాంలోని తూర్పు ఛాంపై జిల్లాలో గురువారం సాయంత్రం గంటల‌ వ్య‌వ‌ధిలో మూడు సార్లు భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై ప్ర‌కంప‌న‌ల తీవ్ర 3.6 నుంచి 5.3 వ‌ర‌కు న‌మోదైన‌ట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. తూర్పు ఛాంపై జిల్లా కేంద్రానికి నైరుతి దిశ‌లోని 35 కిలో మీట‌ర్ల దూరంలో ప్ర‌కంప‌న‌లు సంభ‌వించ‌గా రోడ్లు, భ‌వ‌నాల‌తో స‌హా 31కి పైగా నిర్మాణాలు దెబ్బ‌తిన్నాయి. ఇక సాయంత్రం 5.37 గంట‌ల‌కు తొలిసారి భూమి కంపించ‌గా.. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్రంత 5.3గా న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ వాక అధికారులు వెల్ల‌డించారు.

త‌రువాత 6 గంట‌లు నుంచి 7 గంట‌ల మ‌ధ్య రెండుసార్లు 3.6 నుంచి 4.1 తీవ్ర‌త‌తో ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. వ‌రుస‌గా భూమి కంపించ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌నకు గుర‌య్యారు. అయితే ఈ భూప్ర‌కంప‌న‌ల్లో ఎలాంటి ప్రాన న‌ష్టం జ‌ర‌గ‌లేదు. 10 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నాభాతో దేశంలో రెండో అతి త‌క్కువ జానాభా క‌లిగిన రాష్ట్ర‌మైన మిజోరాంలో ఇప్ప‌టికే ప‌లుమార్లు భూకంపాలు చోటు చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ శాన్య రాష్ట్రాలు పూర్తిగా.. కొండ ప్రాంతాలు కావడం‌తో ఇక్క‌డ భూకంపాలు సంభ‌వించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Read More:

సీఎంవో సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం

139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన ‘డాల‌ర్ బాయ్’

నిత్యానందపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన త‌మిళ న‌టి

వ‌ర‌ల్డ్ కరోనా అప్‌డేట్స్.. 2.46కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు