AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీ హత్యకు కుట్ర..? అమెరికా నిఘా సంస్థతో బేరసారాలు.. ముగ్గురు అరెస్ట్!

బీహార్‌లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి 22 ఏళ్ల అమన్ తివారీతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

PM Modi: ప్రధాని మోదీ హత్యకు కుట్ర..? అమెరికా నిఘా సంస్థతో బేరసారాలు.. ముగ్గురు అరెస్ట్!
Pm Modi Assassination Plot
Balaraju Goud
|

Updated on: Apr 10, 2026 | 3:47 PM

Share

బీహార్‌లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి 22 ఏళ్ల అమన్ తివారీతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీజీపీ తెలిపారు. అతనిపై గతంలో ఒక కేసు ఉన్నట్లు సమాచారం అందింది. అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది. ఆ యువకుడి అసలు ఉద్దేశం ఏమిటో కూడా నిర్ధారిస్తున్నామని డీజీపీ తెలిపారు.

ఈ కుట్ర కోసం అమన్ తివారీ అమెరికా గూఢచార సంస్థ అయిన సీఐఏకు ఒక ప్రతిపాదన పంపించి, ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ కుట్రను అమలు చేయడానికి అతను 22 రోజుల సమయం కూడా కోరాడు. ఈ సమాచారం అందిన వెంటనే, నిఘా సంస్థలు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతాపరమైన ఆందోళనగా పరిగణిస్తున్నారు. మొత్తం నెట్‌వర్క్‌పై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి, ముగ్గురిని అరెస్టు చేశారు. అందిన నిఘా సమాచారం మేరకు, బక్సర్, దుమ్రాన్ పోలీసుల సంయుక్త బృందం రంగంలోకి దిగింది. బక్సర్ జిల్లాలోని అమన్ తివారీ ఇంటిపై దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే, వారి పేర్లను గోప్యంగా ఉంచారు. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చని పోలీసులు చెబుతున్నారు. నిందితులందరినీ నిఘా విభాగంగ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సోదాల సమయంలో అమన్ గది నుంచి ఒక ల్యాప్‌టాప్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ పరికరాలను సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. ఇవి ముఖ్యమైన ఆధారాలు అందించగలవని పోలీసులు భావిస్తున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున గదిని సీల్ చేశారు. అమన్ ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అమన్ తివారీకి నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2022లో, అతను కోల్‌కతా విమానాశ్రయాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నాడు. ఆ సమయంలో అతను విదేశీ పరిచయస్తులతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే, కోల్‌కతా పోలీసులు అతడిని సకాలంలో అరెస్టు చేశారు. అతను మైనర్ కావడం వల్ల తీవ్రమైన చర్యల నుండి తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. అమన్ తివారీ కుటుంబం ఆర్థికంగా మధ్య తరగతికి చెందినది. అతని తండ్రి, గణేష్ తివారీ ధార్మిక కర్మకాండలు నిర్వహిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు.

అమన్ స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్నాడు. పెద్దగా ఉన్నత చదువులు అబ్బలేదు. కానీ అతను ఇంటర్నెట్‌లో చాలా చురుకుగా ఉండేవారని పోలీసులు తెలిపారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో అతను ఈ కుట్ర పన్ని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఒంటరిగా ఈ పని చేశాడా లేక ఒక పెద్ద నెట్‌వర్క్‌లో భాగమా అని నిర్ధారించుకోవడానికి పోలీసులు, నిఘా సంస్థలు ప్రస్తుతం ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాయి. సైబర్ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అంతర్జాతీయ సంబంధాలపై కూడా విచారణ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే