
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కన్నబిడ్డల పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఇంటి నుంచి పారిపోవడంతో కన్న బిడ్డలపై కర్కశత్వం చూపాడు. ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది. ఒడిశాలోని కొయిడా జిల్లా కులా గ్రామానికి చెందిన పండు శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికొచ్చాడు. భార్యతో గొడవపడ్డాడు. గొడ్డలితో ఆమెను వెంబడించాడు. చంపేస్తాడేమోనన్న భయంతో ఆమె దాక్కుంది. తీవ్ర ఆగ్రహంతో ఇంటికొచ్చిన పండు.. అభంశుభం తెలీని తన ముగ్గురు పిల్లలు సీమ (5), రాజు (2), ఆరు నెలల చిన్నారిపై రాక్షసత్వం చూపించాడు. ముగ్గురినీ గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం మృతదేహాలను బావిలో పడేశాడు. తర్వాత అడవుల్లోకి పారిపోయాడు. ఆదివారం ఉదయం తల్లి ఇంటికొచ్చి చూసేసరికి పిల్లలు కనిపించకపోవడంతో సమీపంలో గాలించింది.
అయినా ఆచూకీ దొరకకపోవడంతో బావిలో వెతికారు. బావిలో చిన్నారుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకి పంపించారు. కొన్ని గంటల వ్యవధిలో ఈ దారుణానికి పాల్పడిన పండుును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Joe Biden: రష్యా అభివృద్ధిని అడ్డుకునేందుకు బైడెన్ సరికొత్త ప్లాన్.. సక్సెస్ అవుతుందా..!
CSK vs SRH Live Score, IPL 2022: హైదరాబాద్ ముందు కొండంత లక్ష్యం.. ధోనీ సారథ్యంలో భారీ స్కోర్..