కోవిడ్ నిబంధనలను పక్కనబెట్టి కోల్ కతా లో మహిళల దుర్గాపూజా సంబరాలు

| Edited By: Anil kumar poka

Oct 20, 2020 | 12:15 PM

కోవిడ్ రూల్స్ ని ఖాతరు చేయకుండా కోల్ కతాలో వందలాది మహిళలు దుర్గాపూజా ఉత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. దుర్గామాత పందిళ్ళకు వచ్ఛేవారు తప్పనిసరిగా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించాలని సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ఆదేశించారు.

కోవిడ్ నిబంధనలను పక్కనబెట్టి కోల్ కతా లో మహిళల దుర్గాపూజా సంబరాలు
Follow us on

కోవిడ్ రూల్స్ ని ఖాతరు చేయకుండా కోల్ కతాలో వందలాది మహిళలు దుర్గాపూజా ఉత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. దుర్గామాత పందిళ్ళకు వచ్ఛేవారు తప్పనిసరిగా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించాలని సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ఆదేశించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. పెద్ద సంఖ్యలో వస్తున్న మహిళలను పోలీసులు గానీ, వాలంటీర్లు గానీ నియంత్రించలేకపోయారు. పందిళ్ళ వద్దకు చేరుకున్న మహిళలు ఆటలు, పాటలతో సంబరాల్లో మునిగి తేలారు. కొన్ని చోట్ల మాస్కులు ధరించనివారిని పూజా కమి టీలు అనుమతించలేదు.  అయితే ఈ కమిటీ సభ్యులతో అక్కడక్కడా వీరు వాగ్యుధ్ధానికి దిగారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఈ నెల 22 న అసలైన పండుగ రోజున తలెత్తే పరిస్థితిని అధికారులు మదింపు చేస్తున్నారు.