ఉబర్: రైడ్ బుక్ చేసుకోవాలంటే.. సెల్ఫీ దిగాల్సిందే.!

ఇకపై ప్రయాణీకులు క్యాబ్‌లో రైడ్ చేయాలంటే.. తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తెలిపింది.

ఉబర్: రైడ్ బుక్ చేసుకోవాలంటే.. సెల్ఫీ దిగాల్సిందే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 20, 2020 | 12:12 PM

Uber New Mask Rule: ఇకపై ప్రయాణీకులు క్యాబ్‌లో రైడ్ చేయాలంటే.. తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తెలిపింది. ఈ సంస్థ నేటి నుంచి కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. కొత్తగా ‘మాస్క్ వెరిఫికేషన్ ఫీచర్’ అనే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో ప్రయాణీకుడు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే.. మాస్క్ ధరించి ఉన్న సెల్ఫీని పంపించాల్సి ఉంటుంది.

డ్రైవర్, ప్రయాణీకుడు భద్రతలకు ప్రాధాన్యమిస్తూ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని ఉబెర్‌ ఇండియా సీనియర్‌ డైరక్టర్‌ సచిన్‌ కన్సాల్‌ వివరించారు. ఈ నిబంధన సెప్టెంబర్ నుంచే అమెరికా, కెనడా దేశాల్లో అమలులోకి తెచ్చామని సంస్థ పేర్కొంది. అలాగే డ్రైవర్, ప్రయాణీకుడిలో ఎవరు మాస్క్ ధరించకపోయినా.. ఎలాంటి జరిమానా లేకుండానే ప్రయాణాన్ని రద్దు చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ డ్రైవర్లకు 30 లక్షల మాస్కులు, రెండు లక్షల శానిటైజింగ్ బాటిల్స్ ఉచితంగా ఇచ్చినట్లు సంస్థ తెలిపింది.