Mumbai Cafe: ఆ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగులంతా వారే.. ముందు నువ్వు మారు.. ప్రపంచం అదే మారుతుందంటున్న యజమాని

|

Mar 14, 2022 | 2:46 PM

Mumbai Cafe: రోజు రోజుకీ సమాజంలో పెరుగుతున్న అవగాహన, పురోగతితో దేశంలో అనేక సామాజిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా లింగమార్పిడి(Transgender) చేయించుకున్నవారి పట్ల ఆలోచనా విధానంలో మార్పులు

Mumbai Cafe: ఆ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగులంతా వారే.. ముందు నువ్వు మారు.. ప్రపంచం అదే మారుతుందంటున్న యజమాని
Mumbai Cafe Run By Transgen
Follow us on

Mumbai Cafe: రోజు రోజుకీ సమాజంలో పెరుగుతున్న అవగాహన, పురోగతితో దేశంలో అనేక సామాజిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా లింగమార్పిడి(Transgender) చేయించుకున్నవారి పట్ల ఆలోచనా విధానంలో మార్పులు వచ్చాయి. వారు తమ  హక్కుల కోసం పోరాడుతున్నారు కూడా. అయితే సమాజంలో వీరి అంతరాన్ని తగ్గించడానికి అనేక చిన్న సంస్థలు క్రమంగా ముందుకు వస్తున్నాయి. వాటిలో ఒకటి ముంబైలో కొత్తగా తెరిచిన కేఫ్ – బంబై నజారియా (Bambai Nazariya) – ఇది లింగమార్పిడి చేయించుకున్న వారికోసం ప్రత్యేకంగా ఏర్పడిన కేఫ్. సామాజికంగా ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాటు చేయబడింది. రెండు నెలల క్రితం ప్రారంభించబడిన, కేఫ్ కేవలం లింగమార్పిడి కమ్యూనిటీకి వారికి మాత్రమే ఉపాధి కల్పిస్తుంది. అవును అక్కడ కేఫ్‌లోని ఉద్యోగులంతా ట్రాన్స్‌జెండర్సే.. “ముందు నువ్వు మారు.. తర్వాత ప్రపంచం ఆటోమేటిక్‌గా మారుతుంది” అనే నినాదంతో ఆ కేఫ్‌ వాళ్లు ట్రాన్స్‌జెండర్స్‌కి మాత్రమే ఉద్యోగమిస్తూ ఫేమస్‌ అయిపోయారు. ట్రాన్స్‌జెండ‌ర్స్‌కు కూడా హ‌క్కులుంటాయి. వాళ్ల‌కూ ఈ దేశంలో బ‌తికే హ‌క్కు ఉంది. ప‌ని చేసే హ‌క్కు ఉంది. కానీ.. ఇప్ప‌టికీ ట్రాన్స్‌జెండ‌ర్స్‌ను కొంద‌రు దూరం పెడుతున్నారు. అలాంటి వ్య‌వ‌స్థ పోవాలి.. అనే స‌దుద్దేశంతో ఓ కేఫ్‌.. ఉద్యోగులుగా ట్రాన్స్‌జెండ‌ర్స్‌నే నియ‌మించుకుంది. అదే ముంబైలోని వెర్సోవాలో ఉన్న బాంబాయ్ న‌జారియా కేఫ్‌. ఆ కేఫ్ మోటో ఏంటో తెలుసా? న‌జారియా బ‌ద‌లో.. న‌జారా బ‌ద్‌లేగా అంటే.. ముందు నువ్వు మారు.. ఆ త‌ర్వాత ఈ ప్ర‌పంచ‌మే మారుతుంది అని అర్థం.

ఈ కేఫ్‌లో ట్రాన్స్‌జెండ‌ర్స్‌ను మాత్రమే ఉద్యోగంలోకి తీసుకోవ‌డంతో వెర్సోవా ప్రాంతంలో ఈ కేఫ్ ఫేమ‌స్ అయిపోయింది. ట్రాన్స్‌జెండ‌ర్స్‌కు ఒక దారి చూపించిన ఆ కేఫ్ ఓన‌ర్‌కు స్థానికులు స‌లాం కొడుతున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా ఈ కేఫ్ గురించి చాలామంది వీడియోలు తీసి పోస్ట్ చేశారు. బాంబే ఫుడీ టేల్స్ అనే యూట్యూబ్ చానెల్‌లో ఇటీవ‌ల ఈ కేఫ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయ‌డంతో ఆ వీడియో వైర‌ల్ అవుతోంది.

Also Read:

ఈ ఫొటోలో ముఖ్యమంత్రి ఉన్నారు.. యూత్ ఐకానిక్ ఈయనే.. గుర్తుపడితే మీరు జీనియస్..

నకిలీ వే- బిల్లులతో టాక్స్ క్రెడిట్ కొట్టేశారు.. ఫాస్ట్ టాగ్ కార్డులను అలా ఉపయోగించి..